ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో జరగాలి జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచాలి ప్రసవాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని, సాధారణ ప్రసవాలను పెంచాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా డాక్టర్లకు సూచించారు.

ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో జరగాలి

జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచాలి

ప్రసవాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని, సాధారణ ప్రసవాలను పెంచాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా డాక్టర్లకు సూచించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్లు గైనకాలజిస్టులు, అనస్టలిస్టులు మెడికల్ ఆఫీసర్లు, వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఏరియా ఆస్పత్రి వారీగా సాధించిన ప్రగతిని , ఆయా ఆస్పత్రిలో అందిస్తున్న సేవలు, అన్ని విభాగాలలో అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల వివరాలు, ఆరోగ్యశ్రీని వినియోగిస్తున్న ది, రోగులకు అందిస్తున్న డైట్, ప్రసవాల సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నూటికి నూరు శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా పక్కగా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. క్షేత్ర స్థాయి నుండి పై స్థాయి వరకు తమ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.

నాణ్యమైన సేవలందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలని అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులు ఉన్నాయని, అన్ని రకాల స్కానింగ్స్,టెస్ట్ లు ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరగాలని, రోగుల పై ఎలాంటి భారం పడకుండా వారికి అన్ని విధాల సహకరించి వైద్యసేవలు అందించాలన్నారు.

సి సెక్షన్స్ మరింతగా తగ్గాలని, సాధారణ ప్రసవాలను అన్ని ఆసుపత్రులలో పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏరీయా ఆస్పత్రులలో రాత్రి వేళలో ఎమర్జెన్సీ కేసులను విధిగా అటెండ్ చేయాలని డాక్టర్లకు సూచించారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ కేసులలో ప్రత్యేక శస్త్రచికిత్సలు విజయవంతంగా చేస్తున్న విషయాలను ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని , అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్నివేళలా సిద్ధంగా ఉండాలన్నారు. వైద్యులు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ గాయత్రీ దేవి, డాక్టర్ సంగారెడ్డి, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ లు, సర్జన్లు, గైనకాలజిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post