ప్రస్తుత,భవిష్యత్తు తరాలకు చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

 

*ప్రస్తుత,భవిష్యత్తు తరాలకు
చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

——————————-

తెలంగాణ పోరాటాలకు స్ఫూర్తి ప్రధాత వీరనారి చాకలి ఐలమ్మ జీవితం ప్రస్తుత తరాలకే కాదు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

సోమవారం కలెక్టరేట్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పిల్లలకు , భావితరాలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం.
తెలంగాణ కు ఐలమ్మ లు ఐకాన్ లాంటి వారని , వారి గురించి అవగాహన ఇలాంటి కార్యక్రమాల ద్వారా పెరుగుతుందన్నారు.

మన ఐడెంటిటీ ను మర్చిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చాకలి ఐలమ్మ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషం అని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య,
జిల్లా అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్, ఖీమ్యా నాయక్ ఆర్డీవోలు టి శ్రీనివాసరావు , పవన్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి, రజక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
——————————–

Share This Post