ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అప్రతమత్తంగా ఉండాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌

ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుండి డి.జి.పి. మహేందర్‌రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వాతావరణ శాఖ జారీ చేసిన సూచనలు మేరకు భాదీ వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటిప్పుడు అప్రమత్తం చేయాలని, నీటి పారుదల, విద్యుత్‌ శాఖ అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు హెడ్‌క్వాటర్స్‌లోనే ఉంటూ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, డ్యాములు నిండాయని, గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వలన ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులందరూ అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని, మంగళవారం కృష్ణాష్టమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నా కూడా అధికారులందరూ తమ హెడ్వాార్టర్స్‌ లోనే ఉండి పరిస్థితులను పరిశీలించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. గ్రామ పంచాయితీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్‌ కమీషనర్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. చేపలు పట్టడానికి చెరువులు, వాగుల దగ్గరికి వెళ్లకుండా బందోబస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రమాద ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కఠినంగా నిరోధించాలని, అవసరమైనచోట ట్రాఫిక్‌ మళ్ళించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ జిల్లాలో శ్రీ పాద ఎల్లంపల్లి భారీ ప్రాజెక్టు, 4 మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు చిన్న తరహా ప్రాజెక్టులు, 890 చెరువులు ఉన్నాయని, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తంగా చేస్తూ అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటామని, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంచుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, ఎ.సి.పి. అఖిల్‌
మహాజన్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడు, నీటిపారుదల శాఖ ఈ, ఈ. సత్యనారాయణ, రోడ్లు-భవనాల శాఖ ఈ. ఈ. రాము, పంచాయతీరాజ్‌ ఈ. ఈ. ప్రకాష్‌ సంబంధీత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post