ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూమిని ఇరిగేషన్ అధికారులకు అప్పగించి నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

బుధవారం సీతమ్మ బహుళార్ధ సాధక ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల పథకం, పులుసుబొంత ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియ, మెటల్, ఇసుక, సిఏ ల్యాండ్ కేటాయింపు తదితర అంశాలపై రెవిన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్, మైనింగ్, ఏడి, ఎల్ అండ్ టి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతమ్మ సాగర్ పనులను వేగవంతం చేయాలని ఎల్ అండ్ టి అధికారులను ఆదేశించారు. 741 ఎకరాలకు ఈ నెలాఖరు వరకు అవార్డు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. 322 ఎకరాలు సిఏ ల్యాండ్ సమస్య పరిష్కారానికి సబ్ కలెక్టర్, ఆర్డీఓ చర్యలు తీసుకోవాలని చెప్పారు. సిఏ ల్యాండ్ అటవీశాఖకు ఇవ్వాల్సి ఉన్నందున తహసిల్దారులు, అటవీ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి మ్యాపు తయారు చేసి ఎస్ఆర్డీ, తహసిల్దార్, సర్వేయర్ ధృవీకరణ చేసి నివేదికలు పంపాలని చెప్పారు. సీతమ్మ పాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన ఇసుక కొరకు తక్షణమే ఇరిగేషన్ అధికారులు టిఎస్యండిసి పిఓకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆయన సూచించారు. మెటల్ క్వారీ ఏర్పాటుకు అనుకూలమైన భూముల నివేదికలు అందచేయాలని చెప్పారు. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ భూ సమస్య పరిష్కారానికి ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పులుసుబొంత ప్రాజెక్టు ఫైనల్ అలైన్మెంట్కు అవసరమైన భూ సేకరణకు ప్రతిపాదనలు అందచేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ సిఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, మైనింగ్ ఏడి జైసింగ్, టిఎస్యంఎన్ఎసి పిఓ ఎల్లయ్య, సర్వే అండ్ ల్యాండ్ ఏడి కుసుమకుమారి, ఆర్డీఓ స్వర్ణలత, అన్ని మండలాల తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post