ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 30: జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ ప్రాజెక్టు పనులు సమన్వయంతో పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్యాకేజీ 9 మల్కపేట రిజర్వాయర్ కు భూ సేకరణకు అవార్డు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అటవీ హద్దులను పరిష్కరించాలని, జాయింట్ సర్వే చేయాలని అన్నారు. ప్యాకేజీ 12 మల్లన్న సాగర్ కెనాల్ పిడి ప్రతిపాదనలు సమర్పించినట్లు ఆయన తెలిపారు. మనోహరబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ అవార్డు తయారీ తుది దశలో ఉందన్నారు. టీఎస్ఐఐసి, పెద్దూర్ బోనాల ఇండస్ట్రియల్ పార్క్ పనుల్లో వేగం పెంచాలన్నారు. రెండో బై పాస్ రోడ్ పనులకు అవార్డు ఆమోదానికి సిద్ధం చేశామన్నారు. సీఏ భూముల అప్పగింతల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపడుతున్న రోడ్లు, వంతెనల పూర్తికి సమస్యలు అధిగమించాలన్నారు.
ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారిణి బాలామణి, ఇంఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి. లీల, ప్యాకేజీ – 9 ఈఈ జి. శ్రీనివాస రెడ్డి, ఆర్ & బి ఈఈ కిషన్ రావు, ఏడీ సర్వే & ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రవికాంత్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post