ప్రాణహిత పుష్కరాల్లో శనివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

*ప్రచురణార్థం-5*

కాళేశ్వరం, ఏప్రిల్ 23: ప్రాణహిత పుష్కరాల్లో భాగంగా శనివారం భక్తులు అధిక సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించి, కాళేశ్వరం లోని ముక్తేశ్వర కాళేశ్వర స్వామిఆలయాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తిరిగి తమ స్వగ్రామాలకు వెళుతున్నారు, శనివారం రోజున సుమారుగా లక్షమంది భక్తులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవాలయంలో పూజలు, ప్రసాదాల ద్వారా 7 లక్షల 50 వేల ఆదాయం సమకూరినట్లు దేవాదాయశాఖ వారు వెల్లడించారు.
———————————————-
సమాచార పౌరసంబంధాల శాఖ, కాళేశ్వరం మీడియా సెంటర్ నుండి జారిచేయనైనది.

Share This Post