ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడుతున్న వ్యక్తులకు వైద్య సేవలందించేందుకు పాలియేటివ్ కొండంత బలమని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

. శుక్రవారం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన పాలియేటివ్ కేర్ యూనిట్, వైరాలజీ ల్యాబ్ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయోభారంతో పాటు ప్రాణాంతకమైన దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడుతూ కనీసం వారి పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. పక్షవాతం, కాన్సర్, మంచం మీద దీన స్థితిలో ఉన్న వ్యక్తులకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. గాయాలు, పుండ్లుతో ఉన్న వ్యక్తులకు పరిశుభ్రం చేయడం జరుగుతుందని చెప్పారు. నయంకానీ వ్యాధులతో భాదపడుతున్న వారికి పాలియేటివ్ కేర్ యూనిట్ కొండంత ధైర్యమని చెప్పారు. చికిత్సలకు లొంగని వ్యాధులతో భాదపడుతున్న వారికి ధైర్యాన్ని కల్పించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. జీవిత చరమాంకంలో ఉన్న వారికి ఈ కేంద్రంలోని సేవలు స్వాంతన చేకూర్చుతాయని చెప్పారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు సహాయత చాలా అవసరమని చెప్పారు. పాలియేటివ్ కేర్ కేంద్రంలో చేరి చికిత్సలు పొందిన వ్యక్తులకు సహాయతగా ఉన్న వారికి చికిత్సలు ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై శిక్షణతో పాటు అవగాహన కల్పిస్తారతని చెప్పారు. ఆసుపత్రి నుండి హెూం కేర్ వ్యాన్ ద్వారా వ్యాధి గ్రస్టుడిని ఇంటికి చేర్చుతారని, ఇంటికి చేరిన తదుపరి ప్రత్యేక వైద్య బృంధం వ్యాధిగ్రస్తుని ఇంటికెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిలో పాలియేటివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. పాలియేటివ్ కేర్ యూనిట్ ద్వారా వైద్యసేవలు అందించడం చాలా హర్షణీయమని వైద్య సిబ్బందిని అభినందించారు. ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ఈ పాలియేటివ్ కేర్ యూనిట్ సంజీవినిగా పనిచేస్తుందని చెప్పారు. అనంతరం వైరాలజీ ల్యాబ్ను ప్రారంభించారు. కోవిడ్ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో వ్యాధి నిర్ధారణకు చేయనున్న ఆర్టిపిసిఆర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. గతంలో ఆర్ టిపిసిఆర్ పరీక్షలకు ఖమ్మం, వరంగల్, హైదరాబాదు వెళ్లాల్సిన పరిస్థితి నుండి మన దగ్గరే చేసుకునే స్థాయికి వచ్చామని చెప్పారు. ఇక్కడే పరీక్షలు నిర్వహణ వల్ల తక్షణం వ్యాధి నిర్ధారణ జరిగింది తెలుసుకోవడంతో పాటు తక్షణ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరావు. డాక్టర్ శిరీష, సరళ, వినోద్, పాలియేటివి కేంద్రం ఇన్చార్జ్ డాక్టర్ ప్రసాద్, కౌన్సిల్ రుక్మాంధర్ బండారి, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, తహసిల్దార్ రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post