ప్రాణాన్ని కాపాడటం మన బాధ్యత :: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు
రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్య మంత్రివర్యులు k. చంద్రశేఖర్ రావు అను నిత్యం శ్రద్ద పెడతారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
శనివారం కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్ మీద శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరిగే వారు చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటలను నేడు మనం ఎన్నో చూస్తున్నామన్నారు
ఈ కార్డియాక్ అరెస్ట్ ద్వారా వ్యక్తులు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని….
ప్రమాదంలో పడిన గుండెకు సత్వర చికిత్స అత్యవసరమన్నారు
సడన్ కార్డియాక్ అరెస్ట్ అయిన సమయం లో ఆ వ్యక్తి ని
ఆస్పత్రికి చేర్చి వైద్య చికిత్స అందించేలోపు ఏమైనా జరిగే ప్రమాదం ఉందని.. అటువంటి
వారికి సత్వరంగా ప్రాథమిక చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ CPR పైన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు
అత్యంత కీలకమైన కార్డియో పల్మనరీ రీససిటేషన్(సిపిఆర్). పైన ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని..
ప్రాణ నష్టం కాకుండా CPR తో సాధ్యం అవుద్దన్నారు
తెలంగాణ ప్రజల ఆరోగ్యం మీద మన ముఖ్యమంత్రి కేసీఆర్ కి విపరీతమైన శ్రద్ద ఉంటుందని…
చిన్న పిల్లల నుండి మొదలు వృద్ధుల వరకు వారి ఆరోగ్యం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టిందన్నారు
డెలివరీ కోసం
ప్రయివేట్ హాస్పిటల్ వెళ్లి అటు ఆరోగ్యాన్ని…. ఇటు డబ్బుల విషయం లో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మన ముఖ్య మంత్రి వర్యులు కెసిఆర్ గమనించి…. ప్రభుత్వ ఆసుపత్రి లోనే
ప్రతీ మహిళ నార్మల్ డెలివరీ అవ్వాలని… ఆపరేషన్ లు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ అధికారులకి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుందన్నారు
దీంతో 95 శాతం ప్రభుత్వ ఆసుపత్రి లోనే డెలివరీ లు జరుగుతున్నాయన్నారు
కెసిఆర్ కిట్ తో పేద ప్రజలను ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి కే దక్కుతుందన్నారు
పేద ప్రజలు కంటి పరీక్షల కోసం
ఖర్చు ల పాలు కాకూడదని
కంటివెలుగు కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
శ్రీకారం చుట్టారని..
గ్రామ స్థాయి నుండి ఈ కార్యక్రమం మీద మంచి స్పందన వస్తుందన్నారు
ప్రయివేట్ ఆసుపత్రి కి పోయి కంటి పరీక్షలు చేయించుకోలేని ఎంతో మంది నిరుపేద లు కంటి వెలుగు శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకొని చికిత్స పొందుతున్నారన్నారు
ఈ CPR పైన కూడా
గ్రామ స్థాయి నుండి అవగాహన కల్పించాలని…
దీంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు
ప్రతీ శాఖ కి చెందిన గ్రామ స్థాయి అధికారులు వారి పరిధిలోని వారికి
CPR పైన అవగాహన కల్పించాలన్నారు .
పోలీస్ కమిషనర్ ఏ. వి.రంగనాథ్ మాట్లాడుతూ..
హైదరాబాద్ లో పనిచేసేటప్పుడు ప్రతి కానిస్టేబుల్ ,హోంగార్డ్, సిపిఆర్ ట్రైనింగ్ చేసి రావాలని పెట్టుకోవడం జరిగిందని అన్నారు
జిల్లాల పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల ట్రాఫిక్, నాన్ ట్రాఫిక్ , కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ తో సహా అందరిని సి.పి.ఆర్ ట్రైనింగ్ లో భాగస్వామ్యం చేసి సడన్ గా వచ్చే హార్ట్ టాక్ నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు
పైసా ఖర్చు లేకుండా ఇతరుల ప్రాణాలు కాపాడటం మన అదృష్టంగా భావించాలని అన్నారు
ప్రతీ ఒక్కరూ CPR మీద అవగాహన కలిగి ఉండాలన్నారు
CPR ఎలా చేయాలో తెలిసి ఉంటే…ఎవరికైనా మన ఇంట్లో గాని మనం బయట ప్రయాణం చేసే సందర్భంలో గానీ ఎక్కడైనా ఎవరికైనా సడన్ కార్దియాక్ అరెస్ట్ సంభవించిన సందర్భంలో వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు
పోలీస్ యంత్రాంగం అంటే లా అండ్ ఆర్డర్ తో పాటు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కూడా శ్రద్ధ చూపాలన్నారు
జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన
CPR మీద శిక్షణ కార్యక్రమం ప్రతీ ఒక్కరికి తప్పకుండ ఉపయోగపడుతుందన్నారు
జిల్లా లోని వివిధ శాఖలకు సంబందించిన అధికారులకు CPR మీద అవగాహన కల్పిస్తామన్నారు
డాక్టర్ లా మాదిరిగానే మనం కూడా అంతే పర్ఫెక్ట్ గా CPR ఎలా చేయాలో నేర్చుకోవాలన్నారు
ప్రధాన శాఖలైన పోలీస్, మున్సిపల్, NGO లకు సంబందించిన వారు CPR ఎలా చేయాలో తెలిసి ఉంటే నిత్యం ప్రజలకు దగ్గర్లో ఉండే వీరు ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు
ప్రయివేట్ అసోసియేషన్ వారు, వివిధ కాలేజ్ యాజమాన్యం వారు… ఇంకా ఇతర ఎవరైనా CPR మీద ట్రైనింగ్ కోసం అడిగితె హైదరాబాద్ లో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్ ని పంపిస్తామన్నారు
ఈ కార్యక్రమం లో మేయర్ గుండు సుధారాణి, Zp ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్, MLC బస్వరాజు సారయ్య, కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, అదనపు కలెక్టర్ లు అశ్విని తానాజీ వాకాడే, శ్రీ వాత్స, DMHO వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు