ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ….. ప్రజలకు అందుబాటులో ఉండాలి ….జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

 

వార్త ప్రచురణ:
ములుగు జిల్లా:
నవంబర్2, (మంగళ వారం)

జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య మంగళవారం రోజున వెంకటాపూర్ మండలం లోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ తనిఖీలో ఆరోగ్య కేంద్రం యొక్క స్థితిగతులు తో పాటు సిబ్బంది వివరాలు వారి యొక్క విధి నిర్వహణ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విధులకు గైరజర్ అయిన స్టాఫ్ నర్స్  ఉషారాణికి ఒక్కరోజు వేతనం కట్ చేయుటకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రాథమిక వైద్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వినయ్ అందుబాటులో లేనందున వారితో ఫోన్ ద్వారా మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆన్లైన్ అటెండెన్స్ తప్పనిసరి,ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 గంటలు వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

అనంతరం వెంకటాపూర్ మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పిల్లల,టీచర్స్ హాజరు శాతం పరిశీలించారు.అనంతరం 8,9,10 విద్యార్థుల హాజరు మరియు టీచర్స్ లెస్సన్ ప్లాన్ మరియు టైం టేబుల్స్ ప్రకారం క్లాసులు జరుగుతున్నాయా లేదా నే దానిపైన స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు 100 % ఉండేలా చూడాలని, ఆన్లైన్ అటెండెన్స్ తప్పని సరి అని హెడ్మాస్టర్ ను ఆదేశించారు. పిల్లలకు కోవిడ్ వలన విద్యా సంస్థలు చాలా రోజుల తర్వాత స్కూల్స్ ఓపెన్ అయినవి. ఎక్కువ శ్రద్ద తీసుకొని పిల్లలకి విద్యా బోధన తో పాటు క్రమ శిక్షణ కుండా నేర్పించే బాధ్యత టీచర్స్ పైన ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు.

Share This Post