ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కూసుమంచి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తణిఖీ చేసారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు, 29 ఖమ్మం:

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కూసుమంచి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తణిఖీ చేసారు. వైద్యానికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చేగొమ్మ నుండి వచ్చిన గుగ్గిళ్ళ జయమ్మ తనకు గత పదిరోజులుగా రాత్రి వేళల్లో జ్వరం వస్తున్నదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య చికిత్స పొందుతున్నానని తెలుపగా ఆమెకు అందించిన చికిత్సను మెడికల్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 11 సబ్ సెంటర్ల ద్వారా అందిస్తున్న వైద్యసేవల రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ల్యాబోరేటరి రికార్డులను, ప్రసూతి రిజిష్టరును కలెక్టర్ తణిఖీ చేసారు. పి.హెచ్.సిలో ప్రసవాల సంఖ్య చాలా తక్కువగా ఉందని, సాధారణ కాన్పుల సంఖ్యను మరింత పెంచాలని, హైరిస్క్ కేసులను మాత్రమే జిల్లా ఆసుపత్రికి పంపాలని కలెక్టర్ సూచించారు. డెంగ్యూ, మలేరియ, టైఫాయిడ్ కేసుల ఎన్ని నమోదవుతున్నాయి, జ్వరసర్వే జరుగుచున్నదా,  కుక్కకాటు, పాము కాటు మెడిసిన్ అందుబాటులో ఉన్నదా తదితర వైద్య సేవలను కలెక్టర్ తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు..

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లు, ఇవాంజెలిన్, శ్రీనివాస్, నర్సీంగ్ స్టాఫ్, ల్యాబరేటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post