ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందిస్తున్న వైద్య సేవలు మాతా శిశు సంక్షేమం, గర్భిణీల వివరాలు ఎ.ఎన్.సి రిజిస్ట్రేషన్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్య అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఏప్రిల్ 27 ఖమ్మం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందిస్తున్న వైద్య సేవలు మాతా శిశు సంక్షేమం, గర్భిణీల వివరాలు ఎ.ఎన్.సి రిజిస్ట్రేషన్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ.ఎన్.సి చెకప్, సాధారణ, సి సెక్షన్ ప్రసవాలపై కలెక్టర్ ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని జిల్లాలో మంజూరు అయిన సబ్ సెంటర్ల వివరాలు, స్థితిగతులు, సబ్ సెంటర్కు కావాలసిన వసతులు మంచినీటి సౌకర్యం కావాలసిన వైద్య పరికారాలు అందించడం. జరుగుతుందన్నారు. మాతా శిశు సంక్షేమంపై గర్భిణీల నమోదు ప్రక్రియ కొన్ని పి హెచ్ సిలలో తగినంతగా బేదని దీన్ని అభివృద్ధి చేయాల్సి ఉందిని దీనిపై దృష్టిసారించాలని కొన్ని పి. హెచ్.సి.లలో వంద శాతం గర్భీణీ నమోదు శాతం ఉందని ఇదే స్పూర్తితో అన్ని పి హెచ్ సిలలో అవలంభించాలన్నారు. అంగన్వారీలు, ఆశా వర్కర్లతో ఇంటింటికి వెల్లి వివరాలను సేకరించేలా పర్యవేక్షించాలన్నారు. ప్రతి ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రులలో జరగాలని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని 24 గంటలు నిరంతరాయంగా ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ డ్యూటీలో ఉంటారనే విషయాన్ని తెలియజేయాలన్నారు. ప్రతి నెలా ఏ.ఎన్.సి చెకప్ల వివరాలను, సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించి సిజెరీయన్ ప్రసవాల కలిగే అనర్ధాలను, దుష్పప్రభావలను అర్ధమయ్యా విధంగా గర్భిణీలకు వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు ప్రోత్సాహాకాలు, తల్లి బిడ్డను ఇంటికి చేర్చే బాధ్యత ఉంటుందని తెలపాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రోజువారి అందిస్తున్న వైద్య సేవల వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా||బి. వెంకటేశ్వర్లు, డా|| కోటిరత్నం, కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

Share This Post