ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ వేంసూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పురుగుమందుల విక్రయ కేంద్రం, పెట్రోల్ బంకుకు శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ భూమి పూజ చేసి వరి కోత యంత్రాలను ప్రారంభించారు.

ప్రచురణార్ధం

అక్టోబరు,0] ఖమ్మం:

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ వేంసూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పురుగుమందుల విక్రయ కేంద్రం, పెట్రోల్ బంకుకు శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి భూమి పూజ చేసి వరి కోత యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ మాట్లాడుతూ సింగిల్ విండో సొసైటీలు అనేది రైతులకు ఎలా అండగా నిలవాలనేది వారికి కావాల్సిన సహాయం అందించే విధంగా వేంసూర్ సొసైటీ ఆదర్శవంతంగా రోమోడల్గా ఉందని ఇదే తరహాలో మిగతా సొసైటీలు వేంసూరు సొసైటీని ఆదర్శంగా తీసుకుని పని చేయాలని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా జిల్లాలో మిగతా సొసైటీలు మొబైల్ పెట్రోల్ బంకులు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జిల్లాలో వ్యవసాయ కేంద్రంగా వ్యవసాయ ఆయకట్టు పెరుగుదలకు అవకాశం ఉందని సీతారామ ప్రాజెక్టు కాలేశ్వరం ప్రాజెక్టు నీటి సౌకర్యం పెరిగి ఆయకట్టు పెరిగే అవకాశాలు ఉండటంతో గోదాములు సౌకర్యంతో పాటు మార్కెటింగ్కు సంబంధించి అధికారులు చొరవ తీసుకుని సొసైటీలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో సుమారు 106 సొసైటీలు ఉంటే అందులో 24 సొసైటీలు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నాయని అవి ఆర్ధికంగా ముందంజలో ఉన్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 10 సొసైటీలు ఉంటే అందులో ఏడు సొసైటీలు వేంసూరు మండలంలో ఉన్నాయన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 24 సొసైటీలతో నిత్యం రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా కోపరేటివ్ బ్యాంకుల్లో లోన్ తీసుకునే విధంగా ఖమ్మం జిల్లా కోపరేటివ్ బ్యాంక్ రైతులను ఆదుకుంటుందని అన్నారు. ఇలాంటి బ్యాంకును మనం కాపాడుకొని రైతాంగ ప్రయోజనాలను పొందాలన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 24 వ్యవసాయ సహకార పరపతి కేంద్రాల్లో లోన్లు పొంది రికవరీ చేయడంలో ముందంజలో నిలిచిందన్నారు. రైతులకు ఎంతలోన్ కావాలన్న బ్యాంకులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. సత్తుపలి నియోజకవర్గం వ్యవసాయ కేంద్రంగా గుర్తింపు పొందిందని రైతులు మిశ్రమ పంటలైన తైవాన్ జామ, డ్రాగన్ ఫ్రూట్స్, పుచ్చకాయలను ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. రైతులు ఒకే పంట మీద ఆధారపడకుండా పామాయిల్పై ఆసక్తి చూపాలని అన్నారు.

కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, జిల్లా సహకార శాఖ అధికారి ఏ.విజకుమారి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, డి.సి.సి.బి కార్యనిర్వహణాధికారి ఏ.వీరబాబు, వేంసూరు ఎం.పి.పి పగుట్ల వెంకటేశ్వరరావు, ఎం.పి.టి.సిలు మారోజు సుమలత, నాయుడు, వెంకటేశ్వరరావు, వేంసూరు గ్రామ సర్పంచ్ మహ్మద్ ఫైజుద్దీన్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు వెల్ది జగన్మోహన్ రావు, డి.సి.సి.బి డైరెక్టర్ ఖమ్మం గొర్ల సంజీవరెడ్డి, చల్లగుండ్ల కృష్ణయ్య, బోటోలు లక్ష్మణరావు, తహశీల్దారు ముజాహిద్, ఎం.పి.డి.ఓ వీరేషం, మండల వ్యవసాయ అధికారి రామ్మోహన్ రావు, ఆర్.ఐ టి.అశోక్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పా ల్గొన్నారు.

Share This Post