ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారిగా ఏయన్యం, ఆశాకార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నూరు శాతం సాధించు విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియపై క్యాంపు కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులు, వైద్య, రెవిన్యూ, యంపడిఓలు, యంపిఓలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. మొదటిడోసు తీసుకోని ప్రజల యొక్క సమాచారం సేకరణ చేయాలని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మన జిల్లా రాష్ట్రస్థాయిలో 12వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న మండలాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని మండల టీములకు సూచించారు. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆశా కార్యకర్త నుండి జిల్లా వైద్యాధికారి వరకు వ్యాక్సినేషన్ను నూరు శాతం పూర్తి చేయుటకు అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ తక్కువగా జరుగుతున్న మండలాలపై ప్రతి రోజు 100 వ్యాక్సిన్ ఇవ్వాలన్న లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. ఏయనం వారిగా వైద్యాధికారులు సమీక్షలు నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చెప్పారు. గత వారంలో లక్ష్యసాధన ఏ విధంగా జరిగింది. ఈ వారంలో ఏ విధంగా ముందుకు పోవాలన్న అంశంపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ సన్నద్ధం కావాలని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందంజలో ఉన్న బూర్గంపాడు, టేకులపల్లి, కొత్తగూడెం, దుమ్ముగూడెం, జూలూరుపాడు వైద్య, తహసిల్దార్, యంపిడిఓ, యంపిటలను కలెక్టర్ అభినందించారు. వైద్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఆసుపత్రుల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, చెత్తా చెదారాలతో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న, చిన్న మరమ్మత్తులుంటే చేయించుకోవాలని చెప్పారు. ప్రతి వైద్యాధికారి ఏయన్యం, ఆశా కార్యకర్తల వారిగా నిరంతర సమీక్షలు నిర్వహించడం వల్ల ఫలితాలు సులబంగా వస్తాయని చెప్పారు. రోజులు గడుస్తున్నాయి కానీ నూరు శాతం వ్యాక్సినేషన్ ఎందుకు జరగడం లేదని, నూరు శాతం వ్యాక్సిన్ పూర్తయినట్లుగా గ్రామాలను కానీ మండలాలను ప్రకటించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 20 మొబైల్ వాహనాలు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా కేటాయించామని అయినప్పటికీ వ్యాక్సినేషన్ నత్తనడకన జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వేయించుకోని వారి జాబితాను సిద్ధం చేసి ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించి వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామాల వారిగా టాం టాంలు వేయించాలని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో నిర్వహించే సమీక్షా సమావేశాలు, అవగాహన కార్యక్రమాల్లో చర్చ నిర్వహించాలని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయుటకు మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పారు. ప్రతి మండలంలో అదే సిబ్బంది ఉన్నారు కొన్ని మండలాలు వ్యాక్సినేషన్లో ముందంజలో ఉన్నాయి. కొన్ని మండలాల్లో జాప్యం ఎందుకు జరుగుతున్నదని ప్రశ్నించారు. సమన్వయం చేసుకుంటూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పారు. నూరుశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియపై మండల టీములు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదని, ముందుకు రావడం లేదని తనకు కారణాలు చెప్పొద్దని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిగా వ్యాక్సినేషన్ కార్యక్రమ లక్ష్యం, సాధింపులు తదితర వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

 

ఈ టెలికాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, వ్యాక్సినేషన్ ప్రత్యేక అధికారి డాక్టర్ నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post