*ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు పెంచాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

*ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు పెంచాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

*ప్రచురణార్థం-2*

*ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు పెంచాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*

జయశంకర్ భూపాలపల్లి, మే 12: ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలను పెంచాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో ఏఎన్ఎం, హెల్త్ సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన రి ఓరియెంటెషన్ శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి తో ఇప్పటివరకు అన్ని కార్యకలాపాలు పూర్తి స్థాయిలో చేపట్టలేక పోయామన్నారు. కరోనా సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంచి సేవలు అందించినట్లు ఆయన తెలిపారు. వైద్య, ఆరోగ్యానికి సంబంధించి అన్ని పారామీటర్లలో జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు. ఏఎన్సీ చెకప్, ప్రసవాలు, సాధారణ ప్రసవాల నిర్వహణ, ఎన్సీడి చెకప్ లలో జిల్లా వెనుకబడి ఉందన్నారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి, లక్ష్యం సాధన దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఏఎన్సీ మొదటి చెకప్ కు రాగానే నమోదు చేసుకొని, రెండో, మూడో, నాలుగో చెకప్ డ్యూ తేదీల ప్రకారం గర్భిణులను పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రత్యేక కారణాలతో తప్ప, సిబ్బంది నిర్లక్ష్యంతో ఒక్క గర్భిణీ చెకప్ లకు దూరం కావద్దన్నారు. అన్ని చెకప్ లు సక్రమంగా, సమయంలోగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. సాధారణ ప్రసవాల ప్రయోజనాలపై గర్భిణులు, కుటుంబీకులకు అవగాహన కల్పించాలన్నారు. సి సెక్షన్ ఆపరేషన్ ప్రసవాలతో వచ్చే అనర్థాలపై చైతన్యం తేవాలన్నారు. ప్రతి గర్భిణీని ఒక కుటుంబ సభ్యురాలిగా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఎన్సీడి స్క్రీనింగ్ ఖచ్చితంగా చేపట్టాలని, టిబి వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ప్రతినెలా పొందేలా చూడాలన్నారు. ఆర్థిక సహాయం ఖాతా జమలో సమస్యలు ఉంటే, వెంటనే పరిష్కరించాలని ఆయన తెలిపారు. గురువారం ప్రపంచ నర్స్ దినోత్సవం పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. శ్రీరామ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కొమురయ్య, ప్రాజెక్టు అధికారులు డా. శ్రీదేవి, డా. ఉమాదేవి, రవి కుమార్, గోపీనాథ్, డిపిహెచ్ఎం వెంకటమ్మ, సిహెచ్ఓ రాజయ్య, డెమో శ్రీదేవి, డిపివో చిరంజీవి, డిపిఎం మధు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
———————————————-జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post