ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగవ్వాలి..

ప్రచురణార్ధం

ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగవ్వాలి…

మహబూబాబాద్, నవంబర్,11.

పి.హెచ్.సి.లలో పనితీరు మెరుగుపరిచేందుకు వైద్య సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో పి.హెచ్.సి.డాక్టర్ లతో వసతుల కల్పన, వ్యాక్సినేషన్, టి. డయాజ్ఞస్టిక్ (శ్యాంపిల్స్) రక్తపరీక్షల నమూనాల సేకరణ ప్రగతిని సమీక్షించారు.

మిషన్ భగీరథ కనెక్షన్లను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
విద్యుత్ హై వోల్టేజ్ వలన ఇబ్బందులు ఎదురవ్వడం తో వైద్య, కంప్యూటర్ సామగ్రితో పాటు లైట్స్, ఫాన్స్ కాలిపోతున్నాయని కలెక్టర్ దృష్టికి తేగా సంబంధిత అధికారులను పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వ్యాక్సినేషన్ ప్రగతి సాధించాలన్నారు. వ్యాక్సినేషన్ 2వ డోస్ కూడా వేయాలన్నారు.

ప్రతి పి.హెచ్.సి.కి కేటాయించిన రక్త పరీక్షల నమూనాలు సేకరణలో లక్ష్యాలను అధిగమించాలన్నారు.పి.హెచ్.సి వారీగా నివేదిక ఉండాలని జాప్యం తగదన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు ఉప వైద్యాధికారి అంబరీష ఎం సి హెచ్ పి ఓ బిందు పి హెచ్ సి డాక్టర్లు టీ డయాగ్నస్టిక్ హబ్ ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు
————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post