శుక్రవారం దేవాదుల ప్రాజెక్ట్ కు సంబందించి ల్యాండ్ సేకరణ,పరిహారం చెల్లింపు పైన సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు…
ఈ సందర్బంగా ప్రాజెక్టు కు సంబంధించి ముఖ్యమైన ప్యాకేజీ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు.
దేవాదుల ప్రాజెక్టు కు 265 ఎకరాల భూసేకరణ కావలిసి ఉండగా ఇప్పటివరకు 208 ఎకరాలకు సర్వే పూర్తి అయ్యిందని… 80 ఎకరాలకు సంబందించిన రైతులకు పరిహారం చెల్లింపులు జరిగాయని కలెక్టర్ తెలిపారు.
పదిరోజుల్లో 36 ఎకరాలకు అవార్డు ప్రక్రియ పూర్తి కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశం లో ఇరిగేషన్ SE సుధాకర్ రెడ్డి, RDO మహేందర్ జీ,దేవాదుల ప్రాజెక్టు కు సంబందించిన DE , AE లు తదితరులు పాల్గొన్నారు.