ప్రాధాన్యతా రంగాలకు పెద్ద ఎత్తును రణాలను అందించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు డిఆర్డిఓ, వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమలు తదితర శాఖలతో పాటు అన్ని బ్యాంకుల బ్రాంచ్ కంట్రోలర్లుతో జిల్లా సంప్రదింపుల మరియు జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి ఆ ఆర్ధిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్కు అనుగుణంగా రుణాలు మంజూరు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం జిల్లా వార్షిక రుణ ప్రణాళిక క్రింద 4971.39 కోట్లు లక్ష్యం కాగా సెప్టెంబర్ మాసాంతానికి 1753.05 కోట్లు రుణాలు మంజూరు జరిగినట్లు చెప్పారు. చిన్న చిన్న వీధివ్యాపారాలు చేస్తున్న వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఇస్తున్న ముద్ర రుణాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని, వ్యాపారాలు నిర్వహణకు ఆర్థికసాయం మంజూరు చేయాలని ప్రజావాణిలో ప్రజలు దరఖాస్తులు చేస్తుంటే మీ రెందుకు రుణాలు మంజూరులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 బ్యాంకుల్లో ఇప్పటి వరకు 999 మందికి మాత్రమే ముద్ర రుణాలు ఇచ్చారని, బ్యాంకర్లు రుణాలు మంజూరుకు ప్రేత్యక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ముద్ర రుణాలు ఇవ్వడం లేదని ప్రజల నుండి పిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన, ప్రధానమంత్రి భీమా యోజన, అటల్ పెన్షన్ స్కీం, ప్రధానమంత్రి జస్టన్ ఖాతాలు జీరో బాలెన్సుతో ప్రారంబించుటపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ స్కీం క్రింద లబ్దిదారులకు నేరుగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఇవి ప్రజలకు చాలా ఉపయోగకరమైనవని చెప్పారు.

 

ఈ సమావేశంలో ఎన్డీయం శ్రీనివాస్, డిఆర్డిఓ మధుసూదన్రాజు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, వివిధ బ్యాంకులు కంట్రోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post