జోగులాంబ గద్వాలజిల్లా
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరిధిలోని ర్యాలంపాడు, నాగర్ దొడ్డి గ్రామాలకు పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ధరూర్ మండలం ర్యాలంపాడు, నాగర్ దొడ్డి గ్రామాలను సందర్శించారు. పునరా వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం స్థలాల ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వసతులు కల్పించాలని , అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ర్యాలంపాడు లో 67 ఎకరాలలో 816 మంది, నాగర్ దొడ్డి లో 26 ఎకరాలు 287 మంది నిర్వాసితులు ఉన్నారని, వారికి పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పునరావాస కేంద్రాలలో తాగునీరు, పాఠశాలలు, విద్యుత్ ,రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు ,మౌలిక వసతులు ఏర్పాటుచేయుటకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, ఆర్ డి ఓ రాములు , ఇరిగేషన్ ఇ ఇ లు ,జుబెర్, రహీముద్దీన్, , సర్పంచులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…..
.