ప్రీ కోచింగ్ ప్రవేశాల కోసం యువతకు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్

గ్రూప్ ఎగ్జామ్స్ తో పాటు పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతీ, యువకులకు ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వరంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఇప్పటికే ఆన్ లైన్ మెరిట్ టెస్ట్ ప్రాతిపదికన ఎంపికైన అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయని అన్నారు.
వివిధ కారణాల వల్ల కొన్ని ఖాళీలు మిగిలి ఉన్నందున ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో జిల్లాలో అందిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాల కోసం నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని కలెక్టర్ సూచించారు.
ఎస్సీ అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ ప్రవేశ వివరాల కోసం ఏ ఎస్ డబ్ల్యు ఓ సోమశేఖర్ సెల్: 9440196945 కు సంప్రదించాలని తెలిపారు. అలాగే, గ్రూప్ ఎగ్జామ్స్ కు సన్నద్ధం అవుతున్న ఎస్సీ అభ్యర్థులు
ఏ ఎస్ డబ్ల్యు ఓ సిహెచ్.భూమయ్య, సెల్ : 9346679373 కు సంప్రదించాలని తెలిపారు.
బీసీ అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ ఎగ్జామ్స్ ప్రీ కోచింగ్ ప్రవేశాల వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న, సెల్ : 77330069466 కు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
ఎస్టీ పురుష అభ్యర్థులు గ్రూప్ ఎగ్జామ్స్, పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ ప్రవేశాల కోసం సుద్దపల్లి ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనుంజయ్, సెల్ : 9440235108 కు సంప్రదించాలని, ఎస్టీ మహిళా అభ్యర్థులు సిరికొండ ఆశ్రమ పాఠశాల గెజిటెడ్ హెచ్ ఎం కల్పన, సెల్ : 9966185910 ను సంప్రదించాలని సూచించారు.
ప్రీ కోచింగ్ కేంద్రాల్లో నిష్ణాతులైన అధ్యాపకులచే హైదరాబాద్ లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా మరింత మెరుగైన రీతిలో బోధన జరిపించడంతో పాటు ఉచితంగా అభ్యర్థులు కోరుకున్న మెటీరియల్ ను అందిస్తున్నామని అన్నారు. పోలీస్ ఉద్యోగాల శిక్షణ అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సదుపాయం అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా నుండి అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
———————–

Share This Post