ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2018 ప్రకారం జిల్లాకు కేటాయించిన ప్రభుత్వ సిబ్బంది ఈ నెల 31 వరకు విధుల్లో జాయిన్ కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై అన్ని శాఖల జిల్లా అధికారులు, రెవిన్యూ, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యత కొరకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లుతో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల విభజనపై సుదీర్ఘంగా చర్చించి కేటాయింపు ప్రక్రియపై దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో కలెక్టర్ ఛైర్మన్గాగాను, అన్ని శాఖల హెచ్‌డిలు కన్వీనర్లుగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ప్రాధాన్యతను గమనించి యంత్రాంగానికి సహాయ, సహాకారాలు అందించాలని, ఏదేని అభ్యంతరాలుంటే లిఖిలపూర్వకంగా తెలియచేయాలని చెప్పారు. అట్టి అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి మన కేటాయించబడిన ఉద్యోగులకు ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 26, 27 తేదీల్లో కేటాయింపులు పూర్తి చేసి అన్ని శాఖల అధికారులు ధృవీకరణతో కలెక్టరేట్‌కు నివేదికలు సమర్పించాలని చెప్పారు. ఈ నెల 28, 29వ తేదీల్లో సమావేశాలు నిర్వహించి 30వ తేదీన సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేయాలని, ఉత్తర్వులు పొందిన సిబ్బంది ఈ నెల 31వ తేదీన కేటాయించిన స్థానాల్లో విధుల్లో జాయిన్ కావాలని స్పష్టం చేశారు. సీనియార్టిలో స్థిరీకణలో అభ్యంతరాలున్న సిబ్బంది లిఖితపూర్వకంగా సంబంధిత శాఖ అధికారికి ధరఖాస్తు చేసుకోవాలని, అట్టి దరఖాస్తులను కార్యదర్శులకు సిఫారసు చేయనున్నట్లు చెప్పారు. విధుల్లో చేరిన తదుపరి ఉద్యోగులైన భార్యాభర్తలు, ప్రత్యేక కేటగిరి వ్యక్తులు, అనారోగ్య కారణాలున్న వ్యక్తులు ఆధారాలను జతపరుస్తూ సంబంధిత అధికారికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలని, వారందరికీ ప్రాధాన్యతను బట్టి బదిలీలు చేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు కేటాయింపుల్లో జీరో టీచర్సు ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యతను ఇవ్వాలని డిఈఓకు సూచించారు. సీనియార్టి రూపకల్పన తదితర వివరాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నోటీసు బోర్డులో పెట్టాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సిబ్బంది విధుల్లో చేరిన వివరాలు, అలాగే జిల్లా క్యాడర్ పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు అందచేయాలని చెప్పారు. అలాగే ఇతర జిల్లాల నుండి మన జిల్లాకు కేటాయించిన సిబ్బంది వివరాలు కూడా అందచేయాలని చెప్పారు. జిల్లాకు కేటాయించిన ఉద్యోగులకు స్థానాలు కేటాయింపు, ఖాళీల వివరాలు, సీనియార్టి స్థిరీకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు, రెవిన్యూ, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగ, ఉపాద్యాయ సంఘ నాయకులు భగవాన్‌రెడ్డి, విజయ్‌కుమార్, అమరనేని రామారావు, డివి, శ్రీ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు

Share This Post