ఈ ర్యాలీ ని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి జెండా ఊపి ప్రారంభించి, కలెక్టర్ మాట్లాడు తూ ప్రజల లో పర్యావరణo పై అవగాహన రావాలని, ప్లాస్టిక్ కవర్లు వాడకం ప్రజలు తగ్గించి, క్లోత్ కవర్లు వినియోగించాలని, పట్టణం లో కాలుష్యం తగ్గించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత గా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోన్న పుడే, మొక్కలు బాగా పెరిగి కాలుష్యం నియంత్రణ కు దోహద పడుతుందని, ప్రజలు తమ, తమ ఇండ్ల లో ని వ్యర్ధాలను మున్సిపల్ చెత్త వాహనం లో వేయాలని, రోడ్డు పై వేసి కాలుష్యం పెరగడానికి కారణం కాకూడదని కలెక్టర్ ప్రజల ను కోరారు. కాలుష్య నియంత్రణ ప్రతీ ఒక్క రి బాధ్యత అని, అధికారుల తో పాటు అందరు సహకరించి నప్పుడే మనం ముందు తరాల వారికీ స్వచ్ఛమైన గాలి అందివ్వగలమని కలెక్టర్ అన్నారు.
ఈ గ్రీన్ ర్యాలీ లో జిల్లా అధికారులు, ఏ ఇ ఇ వీరేశం, ప్రజా ప్రతినిధులు, ఏన్. జి. ఓ లు, పరిశ్రమ ల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.