ప్రెస్ నోట్.05.06.2022 పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా ఆలేర్ మున్సిపల్ పరిధిలో 8వ వార్డులో చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ తో కలిసి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ మున్సిపాలిటీ పరిధిలో జగుతున్న పనులు నాణ్యత ఉండాలని అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ తగు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ అన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా 3వ రోజు ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలోని పల్లె ప్రకృతి వన్నం నర్సరీని కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా నర్సిరి లోని మొక్కలు బలంగా ఉండాలని , మొక్కలు మధ్య లో ఉన్న కల్పు మొకలను తొలగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వి. శంకరయ్య, వైస్ చైర్మన్ యం. మాధవి,మున్సిపల్ కమిషనర్, యం. ప్రసాద్, కౌన్సిలర్లు డి. నాగలక్ష్మి, యం.సునీత, శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.

Share This Post