ప్రెస్ నోట్ : 06.06. 2022

నాల్గవ విడుత పట్టన ప్రగతిలో కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేట్యివ్ డైరెక్టర్ డా,, ఎన్ .సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని , దీని ద్వారా పట్టణాల యొక్క రూపు రేఖలు మారుతున్నాయని, అందంగా కనిపిస్తున్నాయని , రోడ్లకు ఇరువైపుల మొక్కలు మన రాష్ట్రo సరిహద్దుల వరకు ఉన్నాయని , రోడ్లకు ఇరువైపుల చెట్లు లేకుంటే అది మన రాష్ట్రం కాదని స్పష్టంగా అర్ధం అవుతుందని, తాను నల్లగొండ లో జాయింట్ కలెక్టర్ గా పని చేసే సమయంలో హారితహారం పై ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్రతి గ్రామంలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హరితహారం ద్వారా రాష్ట్రం మొత్తం మొక్కలతో సంపూర్ణాoగా ఉందని అన్నారు. భువనగిరి పట్టణానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించడానికి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగే కొన్ని పనులకు ప్రారంభోత్సవం , మున్సిపల్ కార్యాలయంలో మొక్కలను మున్సిపల్ అడ్మినిస్ట్రేట్యివ్ డైరెక్టెర్ నాటారు.

భువనగిరి శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా గల్లి గల్లి శుభ్రంగా తయారై ఊరు మొత్తం శుభ్రంగా ఉంటుందని గ్రామాలలో పనులన్ని పల్లె ప్రగతిలో పూర్తి చేసుకోవడానికి ప్రజలు స్వచ్ఛదంగా ముందుకు వస్తున్నారని , ఇది మంచి పరిణామమని హరితహారం ద్వారా గ్రామాలన్ని హరిత వనాలుగా కనిపిస్తున్నాయని అన్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడంలో జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటె అంటూ వ్యాధులు ప్రభ3లకుండా ఉంటాయని దీని కొరకు ప్రతి గ్రామంలో సర్పంచ్ తో పాటు గ్రామ అభివృద్ధికి సంబందించిన ప్రతి అధికారి , వార్డు మెంబర్ల కృషి అభినందనీయం , గ్రామాల్లో ప్రతి సమస్యను పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తీర్చుకునేందుకు అవకాశం ఏర్పడిందని కలెక్టర్ అన్నారు.

జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో చెత్త తీసుకువెళ్లే బండ్లు ప్రతి ఇంటికి వస్తున్నాయని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని , చెత్త రోడ్ల పై వేసి పట్టణాన్ని కాలుష్య పరం చేయవద్దని ఆలా చేస్తే మనకే నష్టామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు , వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య , RDMA శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వార్డు కౌన్సిలర్లు ,తదితర సిబ్బంది పాల్గొన్నారు.

—–DPRO YADADRI .

Share This Post