ప్రెస్ నోట్:: 07. 06. 2022 ఆలేరు మండలం రాఘవపురం గ్రామ పంచాయితీ పరిధిలో జరిగిన బాలల పరిరక్షణ సమితి సమావేశానికి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ఎన్రోల్మెంట్ 100 శాతం ఉందని గ్రామంలో ఉన్న 86 మంది బడి ఈడు పిల్లలు అందరు పాఠశాలకు వస్తున్నారని, ఈ రోజు కొత్తగా ఎన్రోల్ అయిన 7 గురు పిల్లలకు అడిషనల్ కలెక్టర్ వారిచే అక్షరాబ్యాసం చేయించారు. పాఠశాల మౌలిక వసతులతో భాగంగా పాఠశాలలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ సరఫరా ఏర్పాటుకు ఎంపీడీఓ ను వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. గ్రామ స్థాయి అధికారులతో గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల పై సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీడీపీఓ చంద్రకళ, డీసీపీఓ సైదులు, ఎంపీడీఓ జె .ప్రకాష్, MPO యo.ఏ సలీమ్, సర్పంచ్, బి. రాంప్రసాద్ , తదితరులు పాల్గొన్నారు.

Share This Post