ప్రెస్ నోట్:: 07. 06. 2022 పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 5 వ రోజు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామాన్ని సందర్శించారు.

గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించి , పల్లె ప్రకృతి వనాన్ని తనిఖీ చేసి గ్రామంలో జరిగే పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించడం జరిగింది.
బడి బాట కారక్రమంలో భాగంగా గ్రామంలో పిల్లల ఎన్రోల్మెంట్ చాలా తక్కువుగా ఉందని ఉపాధ్యాయులు బాగా కృషి చేసి పిల్లల ఎన్రోల్మెంట్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎంపీడీఓ ఎల్.గీత రెడ్డి, ఎంపీపీ యన్. రమేష్ రాజు , MPO కె.ఈశ్వర్, ఎంపీటీసీ చేవూరి భారతమ్మ, గ్రామ సర్పంచ్ చేవూరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు లో జరిగే పనులను జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేసారు. పట్టణ ప్రగతి పనులలో నాణ్యత ఉండాలని పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. మండల పరిధిలోని ప్రభుత్వ , ప్రజా ఉపయోగ సంస్థలను శుభ్రం చేయాలనీ , ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 5 వ రోజు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామాన్ని సందర్శించారు.

Share This Post