ప్రెస్ నోట్ :: 08. 06. 2022 ఆజాధిక అమృత్ మహోత్సవం వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన కస్టమర్స్ అవుట్ రిచ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ముఖ్య అతిధి గా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా మాస్ కుంట ఏ.కె ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లు లబ్ధిదారులతో సహకరించినపుడే లబ్ధిదారులు బ్యాంకు లావా దేవీలు చేసేందుకు ముందుకు వస్తారని, గత సవంత్సరం అన్ని బ్యాంకులు మంచి సహాయ సహకారాలు అందించారని అదే మాదిరిగా ఈ సవంత్సరం కూడా లబ్ధిదారులకు ఋణాలు అందించడంలో బ్యాంకులు ముందు ఉండాలని , ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయుటకు, ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అన్ని బ్యాంక్ అధికారులను కోరారు. జిల్లా గ్రామిణాభివృద్ది సంస్థ ఏర్పాటు చేసిన SHG ఉత్పత్తుల స్టాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా లీడ్ బ్యాంక్ , కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో అన్ని బ్యాంకులతో ఏర్పాటు చేసిన ప్రజా చేరువ కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు.
LDM రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖలు ఒక్కొక స్టాల్ ను ఏర్పాటు చేసిన్నట్లు దీని ద్వారా ఖాతా దారులకు బ్యాంకు చేరువ అయ్యేందుకు మంచి అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి కనిమోజి, DGM కెనరా బ్యాంక్, సీఓ హైదరాబాద్ , డి.ఆర్.డి.ఏ పి.డి . ఉపేందర్ రెడ్డి, వినయ్ DDM నాబార్డ్, శ్రీనివాస్ చీఫ్ మేనేజర్ కెనరా బ్యాంక్ వరంగల్ , రామలింగేశ్వర రావు చీఫ్ మేనేజర్ SBI నాచారం, రగోతం రావు చీఫ్ మేనేజర్ SBI సూర్యాపేట, , వివిధ బ్యాంక్ అధికారులు ఖాతా దారులు పాల్గొన్నారు.

Share This Post