ప్రెస్ నోట్: 17. 03. 2023 గ్రామాలలో పల్లె ప్రగతి పనులను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తుండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎంపీడీఓ లు, MPO లు, ఇ.సి.లతో పల్లె ప్రగతి పనులను మండలాల వారీగా ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో పల్లె ప్రగతి పనులను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించాలని, అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ పంచాయితీల వారీగా వైకుంఠ ధామాలు ఎన్ని ఉన్నాయో చూసుకొని పవర్ సప్లై, నీటి సరఫరా లేని వైకుంఠధామాలకు సంబంధిత విద్యుత్ శాఖ ఇంజనీర్లతో త్వరగా ఎస్టిమేషన్లు వేయించి సోలార్, పవర్ సప్లై పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, వినియోగంలోకి తేవాలని అన్నారు. మిషన్ భగీరథ కింద గ్రామాలలో పెండింగ్ ఉన్న వాటర్ కనెక్షన్ పనులు, బోర్ వెల్స్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, వేసవి కాలం కావస్తున్నందున నీటి ఎద్దడి ఎక్కువ ఉంటుందని, వాటి పై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు త్వరగా పూర్తి చేసి ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సెప్టిక్ ట్యాoకులకు సంబంధించి సోక్ పిట్ల ఏర్పాట్లుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి మండలానికి 300 సోక్ పిట్ల లక్ష్యాన్ని పెట్టుకోవాలని తెలిపారు. వివిధ కాంపోనెంటుల నిధులు త్వరగా జనరెట్ చేసి పంపిణీ త్వరగా పూర్తి చేసి ప్రతి లబ్ధిదారునికి అందేలా చూడాలని అన్నారు. జిల్లాల్లో బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలను మోడల్ విలేజీలుగా సిద్ధం చేయాలని, వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజలకు అర్థమయ్యే విధంగా వాల్ పెయింటింగ్స్ పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ పనులకు లేబర్ మోబిలైజేషన్ చేసి వారికి ఉపాధి కల్పించేలా పనులు చేపట్టాలని, వారి ఆర్థిక అభివృద్ధి కొరకు పాటుపడాలని. గ్రామ పంచాయితీలలో నర్సరీల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి జర్మినేషన్ చేయాలని, అవెన్యూ ప్లాంటేషన్ కింద ప్రతి రోజు మొక్కలకు నీరు, రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీల శాతం పెంచాలని, అర్హత గల ప్రతి ఒక్కరికి పని కల్పించాలని సూచించారు. గ్రామ పంచాయితీ డెవలప్మెంట్ పనులు 2023 -24 కు సంబందించిన యాక్షన్ ప్లాన్ పూర్తి చేసి ఈ నెల 31 లోగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. పల్లె ప్రగతి పనులలో మండలానికి లక్ష్యాన్ని సాధించిన మూడు గ్రామాలను ఎంపిక చేసి ప్రజా ప్రతినిధులను సిబ్బందిని, సత్కరించాలని, గ్రామాలలో పెండింగులో ఉన్న పనులను ఈ నెల 24 లోపల పూర్తి చేసుకోవాలని, గ్రామాలలో వంద శాతం టాక్స్ కలెక్షన్ చేపట్టాలని సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణ అభివ్రుద్ది అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, అడిషనల్ డి.ఆర్.డి.ఓ. నాగిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

……DPRO ., YADADRI .

Share This Post