ప్రెస్ నోట్:02.06. 2022 జూన్ 2-2022 తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహా దారులు గౌ,,శ్రీ ఏ.కె ఖాన్ IPS (రిటైర్డ్) ముఖ్య అతిధిగా హాజరై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

తొలుత ముఖ్య అతిధి భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి , జిల్లా కలెక్టర్ కార్యాలయoలో పోలీస్ శాఖ చే గౌరవ వందనం స్వీకరించి మాట్లాడుతూ జిల్లాలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై ప్రసంగించారు.

తదుపరి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు ముఖ్య అతిధి హాజరై , సాంఘిక సంక్షేమ శాఖ చే ఏర్పాటు చేయబడిన ఆస్తుల పంపిణీలో భాగంగా తాజ్ పూర్ గ్రామo , భువనగిరి మండలానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ఒక లబ్ధిదారునికి కారును అందజేయడం జరిగింది.

గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి రూరల్ Transport పథకం కింద సంస్థన్ నారాయణపూర్ మండలం పొర్లగడ్డ తండాకు చెందిన గిరిజన లబ్ధిదారునికి టాటా ఏసీ వాహనాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణ రెడ్డి, భువనగిరి శాసన సభ్యులు ఫైళ్ళ శేఖర్ రెడ్డి, MLC కృష్ణ రెడ్డి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ,రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, మునుగోడు మాజీ శాసన సభ్యులు కె.ప్రభాకర్, జడ్పీ సీఈఓ కృష్ణా రెడ్డి, పీడీ DRDA ఉపేందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్ , సీపీఓ మాన్య నాయక్, డీపీఓ సునంద, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి, తదితర జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

————————————————————————————–

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవానికి హాజరైన ప్రజా ప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, స్వాతంత్ర్య సమరయోధులు, ఉద్యమకారులు, ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ విద్యార్ధులకు, జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ అవతరించి నేటికి ఎనమిది వసంతాలు. మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ ఎనమిదేళ్ళలో బలమైన అడుగులు వేయగలిగాం. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా మనం ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్పలితాలనిచ్చాయి. గతం సృష్టించిన సమస్యల వలయంలోంచి బయటపడడమే కాకుండా, నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా భావిస్తున్నాను. నేడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికి గర్వకారణాలు.

అనతికాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలను సాధించిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. వివిధ రంగాలలో రాష్ట్రము సాధించిన ప్రగతి, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు దేశ విదేశాల నుంచి పలు ప్రసంశలు అందుతున్నాయి. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని ఎన్నో కార్యక్రమాలకు నాందిపలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. పలు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఇక్కడికి వచ్చి మన పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి, ఆయా రాష్ట్రాలలో అమలుచేసేందుకు సమయత్తమవడమే ఇందుకు నిదర్శనం. అనేక రంగాలలో జాతీయస్థాయిలో మన రాష్ట్రం సాధించిన అవార్డులు సమర్థవంతంగా సాగుతున్న పరిపాలనకు గీటురాళ్ళు.

రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపద అంతా సమానత్వం. సామాజిక న్యాయము ప్రాతిపదికగా సమస్త ప్రజానీకానికి పంపిణీ జరగాలనే లక్ష్యముతో ప్రభుత్వం పురోగమిస్తున్నది. సకలజనుల సంక్షేమానికి పాటుపడుతున్నది. ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల దీవెనలతో అన్ని రంగాలలో రాష్ట్రం ముందడుగు వేస్తున్నది.
11.10.2016 నాడు ఏర్పాటు అయిన యాదాద్రి భువనగిరి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ క్రింది పథకాలను, ప్రణాళికలను అమలు చేస్తున్నాము.

వ్యవసాయం:

మన యాదాద్రి భువనగిరి జిల్లాలో 2021-22 సంవత్సరం వానాకాలం మరియు యాసంగి సిజన్ లో 6 లక్షల 46 వేల 411 ఎకరాల విస్తీర్ణంలో పంటలను సాగు చేయడము జరిగినది.
“రైతు బంధు పథకo” క్రింద 2021 సంవత్సరం లో వానాకాలం సీజనులో 2 లక్షల 14 వేల 417 మంది రైతులకు 287 కోట్ల 58 లక్షల రూపాయలను మరియు 2021-22 సంవత్సరం యాసంగి సీజనులో 2 లక్షల 25 వేల 114 మంది రైతులకు 291 కోట్ల 98 లక్షల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగినది. రైతు బీమా పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు మరణించిన 2 వేల 295మంది రైతుల కుటుంబాలకు 114 కోట్ల 75 లక్షల రూపాయలు వారి నామిని ఖాతాలలో జమ చేయడం జరిగింది.
జిల్లాలో ఉన్న 92 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తి అయినవి.దీనిలో ప్రతి మంగళవారం మరియు శుక్రవారము రైతులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుచున్నవి.

యాసంగి 2020-21 సంవత్సరములో (292) ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కనీస మద్దతు ధర క్వింటాలు కి రూ. 1888 ద్వారా 59 వేల 809 రైతుల నుండి 4 లక్షల 24 వేల మెట్రిక్ టన్నుల ధాన్యన్ని కొనుగోలు చెయడం జరిగినది.
వానాకాలం 2021-22 సంవత్సరములో (276) ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కనీస మద్దతు ధర క్వింటాలు కి రూ.1960 ద్వారా 36 వేల 406 రైతుల నుండి 2 లక్షల 83 వేల మెట్రిక్ టన్నుల ధాన్యన్ని కొనుగోలు చెయడం జరిగినది.
యాసంగి 2021-22 సంవత్సరములో (293) ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కనీస మద్దతు ధర క్వింటాలు కి రూ. 1960 ఇప్పటివరకు 1 లక్ష 69 వేల మెట్రిక్ టన్నుల ధాన్యన్ని కొనుగోలు చెయడం జరిగినది.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు ఆర్హులైన రైతులకు పెట్టుబడి సహాయ నిమిత్తము మొత్తం 206 కోట్ల 78 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి ఖాతాలలో జమ చేయడం జరిగినది.
సేద్యం లొ పచ్చిరోట్ట ఎరువుల వాడకం, పంటలకు అవసరమయిన నత్రజెని ఎరువులను ఒకేసారి కాకుండా దఫా దఫాలుగా వేయడము పై రైతులకు అవగాహన చేయడం జరుగుతుంది, మరియు ప్రతి క్లస్టర్ లో 150 మంది రైతులతొ ప్రయోగాత్మకoగా సాగు చేసి, రైతులకు అవగాహన కల్పించడం జరుగుచున్నది.

ఉద్యానవనశాఖ:
సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకము(MIDH) ద్వారా తోటల విస్తీర్ణము పెంచుటకు 32.3 హెక్టర్లలో 34 మంది రైతులకు లబ్ది చేకూర్చనైనది. సూక్ష్మ నీటి పారుదల పథకం(TSMIP) ద్వారా 101 హెక్టర్లలో 94 మంది రైతులకు లబ్ది చేకూర్చనైనది
కూరగాయల నారు సరఫరా పధకం ద్వారా 40% రాయితీతో టమాటా, వంకాయ మరియు మిరప పంటలకు నాణ్యమైన నారును సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, ములుగు నుండి 13 హెక్టార్లలో 2లక్షల 68 వేల రూపాయలతో 17 మంది రైతులకు అందించటం జరిగినది.

జిల్లా పంచాయితీ:
ఈ ఆర్ధిక సంవత్సరమునకు జిల్లాలో ఇంటి పన్నులు 13 కోట్ల 19 లక్షల రూపాయలు లక్ష్యానికి గాను 12 కోట్ల 69 లక్షల రూపాయలు (96%) వసూలు చేయడం జరిగింది.
ఈ ఆర్ధిక సంవత్సరములో 15 వ ఆర్ధిక సంఘం నిధుల ద్వారా 27 కోట్ల 95 లక్షల రూపాయలు మరియు రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు మరియు ఎస్.సి, ఎస్.టి సబ్ ప్లాన్ నిధుల ద్వారా మొత్తం 38 కోట్ల 59 లక్షల రూపాయలు గ్రామ పంచాయితీలకు విడుదల చేయనైనది.
పల్లె ప్రగతి కార్యక్రమము లో భాగంగా జిల్లాలో 421 గ్రామ పంచాయితీలలో ట్రాక్టర్ లను పంపిణి చేయనైనది.

మున్సిపాలిటీలు అభివృద్ధి (పట్టణ ప్రగతి):
గ్రీన్ బడ్జెట్ లో భాగంగా 6 కోట్ల 44 లక్షల రూపాయలు మంజూరి కాగా అందులో 2 కోట్ల 57 లక్షల రూపాయలు వినియోగించనైనది మరియు 6 మున్సిపాలిటీలలో 6 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు 17 కోట్ల రూపాయలతో నిర్మాణ దశలో ఉన్నవి.
పట్టణ ప్రగతి లో భాగంగా జిల్లాలో 6 మున్సిపాలిటీలలో 169 పబ్లిక్ టాయిలెట్స్ కి గాను మొత్తం 161 పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి చేయనైనది మరియు 30 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయనైనది.
జిల్లాలో 6 మున్సిపాలిటీలలో 7 వేల 268 వీది వ్యాపారులకు ఋణం మంజూరి చేయగా, అందులో 6 వేల 815 మందికి డిజిటల్ పేమెంట్ ద్వారా ఋణం విడుదల చేయడమైనది మరియు 6 మున్సిపాలిటీలలో 6 డంపింగ్ యార్డులు నిర్మించడం జరిగింది.
6 మున్సిపాలిటీలలో మొత్తం 52 స్మశాన వాటికలు ఉండగా అందులో 7 వైకుంఠ ధామాలుగా మార్చబడినది. మిగిలిన 45 స్మశాన వాటికలను వైకుంఠ ధామాలుగా మార్చ వలసి ఉన్నది.

వైద్య మరియు ఆరోగ్య శాఖ:
ఏప్రిల్ 2022 నుండి జిల్లాలో కరోన(కోవిడ్-19) పరిక్షలు 12 వేల 794 మందికి చేయగా కేవలం 1 పాజిటివ్ కేసు మాత్రమే రావడం జరిగింది మరియు 12 సంవత్సరాల పైబడిన వారికీ మొదటి టికా మరియు రెండవ టికా లో 100 శాతం ప్రగతి సాదించడం జరిగింది.జిల్లాలో ఇప్పటివరకు 12 లక్షల 35 వేల 325 కరోనా డోసులు ఇవ్వడం వలన కరోన వ్యాధి అదుపులో కి రావడం జరిగింది.
జిల్లాలో కేసిఆర్ కిట్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 17 వేల 878 మంది బాలింతలకు కేసిఆర్ కిట్లు అందించడం జరిగినది. కేసిఆర్ కిట్ లో గర్భిణి స్త్రీ నమోదు నుండి ప్రసవానoతరం పూర్తి టీకాల లోపు నాలుగు విడుతల మొత్తం 24 కోట్ల 70 లక్షల రూపాయలు వారి ఖాతా ద్వారా చెల్లించడం జరిగింది.
545 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు క్షయ పోషణ యోజన కార్యక్రమం ద్వారా ప్రతి నెల 500 రూపాయల చొప్పున 2 లక్షల 72 వేల 500 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది.
152 మంది ఎయిడ్స్ మరియు 449 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఇవ్వడం జరుగుచున్నది.

మిషన్ భగీరధ :
ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించే మిషన్ భగీరధ (వాటర్ గ్రిడ్ ) పథకo ద్వారా గ్రామాలలో ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల మరియు పట్టణాలలో 135 లీటర్లు నీటిని సరఫరా చేయడానికి నిర్ణయించనైనది.
జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలలోని 549 ఆవాసాలకు గోదావరి నీటిని అందించటానికి 750 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి 1లక్ష 76 వేల 169 గృహాలకు త్రాగునీరు ఇవ్వడం జరుగుచున్నది.
1906 km ల పైపు లైన్, 32 OHBR, 14 GLBR లు మరియు 6 సంపులు పూర్తి చేసి, 549 ఆవాసాలలో నీటిని విడుదల చేయడం జరిగింది. కొత్తగా 1 వెయి 639 kmల పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేయడము జరిగినది.
జిల్లాలోని 641 ప్రభుత్వ పాఠశాలలు మరియు 762 అంగన్వాడి పాఠశాలలకు నల్లా కనెక్షన్లను ఇవ్వడము జరిగినది మరియు (43 ప్రభుత్వ బి.సి, యస్సీ, ఎస్.టి. మరియు మైనారిటి నివాస విద్యా సంస్థలకు మంచి నీటి సౌకర్యము ఇవ్వడము జరిగినది.
జిల్లాలోని 261 వైకుంఠధామాలకు ఇప్పటి వరకు నీటి సౌకర్యము కల్పించనైనది. మిగిలిన వైకుంఠధామాలలో పనులు ప్రగతిలో ఉన్నవి .

మిషన్ కాకతీయ:
మిషన్ కాకతీయ 4 ఫేజ్ ల ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమములో భాగంగా మొత్తం 999 చెరువుల గాను 914 చెరువుల పనులు పూర్తి అయినవి మరియు 9 చెక్ డ్యాముల నిర్మాణ పనులకు 30 కోట్ల 84 లక్షల రూపాయలతో పురోగతిలో ఉన్నవి.
కాళేశ్వరం ప్రాజెక్ట్:
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణములో భాగంగా ప్యాకేజీ-15 యొక్క పనులు 74% పూర్తి అయినవి మరియు ప్రధాన కాలువ పురోగతిలో వున్నవి. ప్యాకేజీ-16 యొక్క పనులు 56% పూర్తి అయినవి
నృసింహ సాగర్ 11.39 TMC ల సామర్ధ్యము తో 1 లక్షా 11 వేల 641 ఎకరాల నీటి సదుపాయం కల్పించుటకు గాను పనులు వేగంగా జరుగుచున్నవి.

రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణ పధకం:
ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణ పధకం ద్వారా మన జిల్లాకు 3 వేల 464 ఇండ్లు మంజూరై అందులో 749 పూర్తి కాగా, మిగిలినవి పురోగతిలో ఉన్నవి.

కల్యాణ లక్ష్మి- షాదీ ముబారక్:
జిల్లాలో ఈ ఆర్దిక సంవత్సరoలో కల్యాణ లక్ష్మి పథకం ద్వారా 4 వేల 969 మంది లబ్దిదారులకు 49 కోట్ల 80 లక్షల రూపాయలు, షాదీ ముబారక్ పథకం ద్వారా 85 మంది లబ్దిదారులకు 85 లక్షల 9 వెల రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.
పౌర సరఫరాలు:
తెలంగాణ ప్రభుత్వం జనవరి మాసం, 2015 నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూపాయికి కిలో బియ్యం పథకములో అర్హులైన లబ్దిదారులను గుర్తించి కార్డులోని ప్రతి సభ్యుడికి ఆరుకిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయట౦ జరుగుచున్నది.
513 రేషన్ షాపుల ద్వారా మొత్తం 2 లక్షల 17 వేల 713 కుటుంబాలకు 4 వేల 273 మెట్రిక్ టన్నుల బియ్యం ఈ – పాస్ విదానము ద్వారా పంపిణి చేయడం జరుగుచున్నది.
COVID-19 ఆపత్కాల సమయంలో రేషన్ కార్డుదారులకు జూన్ 2021 మాసం నుండి ఏప్రిల్ 2022 వరకు ఆహార భద్రత కార్డులలోని ప్రతి యూనిట్ కి 10 కిలోల చొప్పున ఉచిత రేషన్ పంపిణీ చేయబడినది.

పశుసంవర్ధకశాఖ:
ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ పై పశుగ్రాస గడ్డి విత్తనాల పంపిణి, పశుఆరోగ్య శిబిరాలు, పశువిజ్ఞాన సదస్సుల ఫలితంగా జిల్లాలో రోజుకి పాల ఉత్పత్తి 6 లక్షల 21 వేల లీటర్లు పాల ఉత్పత్తి తో రాష్ట్రం లో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో ఉన్నది .
గొర్రెల పెంపకం కార్యక్రమం ద్వారా జిల్లాలో 75% సబ్సిడీ పై 32 వేల గొల్ల మరియు కుర్మ కాపరులకు 20 ఆడ గొర్రెలు మరియు 1 పొట్టేలు 1లక్ష 25 వేల రూపాయలతో సరఫరా చేయడం జరిగినది. 2 లక్షల 86 వేల 980 గొర్రెలకు గొర్రె పిల్లలు జన్మించడం వలన 86 కోట్ల ఆదాయం పొందడం జరిగినది.
6 లక్షల 7 వేల 895 గొర్రెలు మరియు మేకలకు ఉచితముగా నట్టల మందు త్రాగించటo జరిగింది.
ఆలేర్ మరియు భువనగిరి నియోజకవర్గం పరిధిలో రెండు సంచార పశు వైద్య శాలలు 1962 టోల్ ఫ్రీ నెంబర్ తో నిరంతరంగా రైతులకు ఇంటి ముంగిట సేవలు అందిస్తున్నాయి.

మత్స్యశాఖ:
జిల్లానందు 134 మత్స్య పారిశ్రామిక సంఘాలు మరియు 10 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉన్నవి.ఈ మత్స్య పారిశ్రామిక సంఘాలలో 8 వేల 929 మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుచున్నారు.
2021-22 సంవత్సరములో వర్షాలు ఎక్కువగా పడుట వలన 1115 చెరువులలో 3 కోట్ల 16 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది మరియు 12 లక్ష 2 వేల మంచినీటి రొయ్య విత్తనమును 9 చెరువులలో విడుదల చేయనైనది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా జిల్లాలో 182 మత్స్య కారులకు 25వేల రూపాయల ఋణాలు బ్యాంకు ద్వారా పొందినారు.

చేనేత మరియు జౌళి శాఖ:
‘’ నేతన్న కు చేయూత పథకం’’ ద్వారా 5 వేల 442 మంది చేనేత కార్మికులకు 21 కోట్ల 48 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం మంజూరి కాబడినవి.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా 10 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 4 కోట్ల 62 లక్షల రూపాయలు క్యాష్ క్రెడిట్ రూపంలో మంజూరి చేయడం జరిగింది.
చేనేత మిత్ర పథకం ద్వారా 15 వేల 128 చేనేత కార్మికులకు 40% నూలు సబ్సిడీ క్రింద 8 కోట్ల 11 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది.

అటవీశాఖ (తెలంగాణకు హరిత హారం) :
హరితహారములో భాగంగా 7వ విడుత వరకు మన జిల్లాలో 2022 సంవత్సరములో ఇప్పటి వరకు 4 కోట్ల 50 లక్షల మొక్కలు వివిధ ప్రదేశాలలో నాటడమైనది.
అటవీ బ్లాకులను పూర్తి పచ్చదనంతో అభివృద్ధి పరుచుటకు అటవీ పునర్జీవన ప్రణాళికలో భాగంగా 52 బ్లాకులకు గాను 8 బ్లాకులను పూర్తి మొత్తంలో saturation అనగా బ్లాకులలోని ఖాళీలలో మొక్కలు నాటుట, చెక్ డ్యాములు, నీటి కుంటలు, బౌండరీ చెట్టు ఫెన్సింగ్, CPT లు, మొదలగు ఇతర నిర్మాణములు చేయుట జరిగినది మరియు మిగిలిన 44 బ్లాకులను రానున్న రెండు, మూడు సంవత్సరాలలో పరిపూర్ణంగా saturation చేయుటకు ప్రణాళికలను రూపొందించుకోవటం జరిగినది.
2021-22 సంవత్సరములో అక్రమ కలప రవాణా పూర్తిగా నిరోధించి, అట్టి వారిపై చర్య తీసుకొని దాదాపు 85 లక్షల రూపాయలు జరిమానా రూపంలో వసూలు చేయటం జరిగినది.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం:
2021-22 ఆర్దిక సంవత్సరములో ఉపాధి హామీ కూలీలకు 37 లక్షల 13 వేల పని దినాలు కల్పించి 16 కోట్ల 15 లక్షల రూపాయలు ఖర్చుచేయనైనది.
పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామములో వైకుంఠధామము, సెగ్రిగేషన్ షెడ్ మరియు పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయడం జరిగింది.
అమృత్ సరోవర్ లో భాగంగా జిల్లాలో 75 ట్యాంక్ లను గుర్తించడం జరిగింది. ఈ 75 ట్యాంక్ లలో సమగ్ర అభివృద్ది జరుపుటకు తగు సన్నాహాలు జరుగుతుంది.
సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో భాగంగా 2019-20 ఆర్ధిక సంవత్సరమునకు గాను భువనగిరి మండలము వడపర్తి గ్రామము ఎంపిక చేయడము జరిగింది. ఈ గ్రామము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశములోనే మొదటి స్దానంలో నిలిచినది.
వాటర్ షెడ్ అభివృద్ది కార్యకమం 2.0 లో భాగంగా నారాయణపూర్ మండలం లో జనగాం ప్రాజెక్ట్ క్రింద 8 గ్రామాలను అభివృద్ది పరుచుటకు 4 వేల 285 హెక్టర్లకు గాను 9 కోట్ల 42 లక్షల రూపాయలు మంజూరి చేయడం జరిగింది.

స్వయం సహాయక సంఘాలు:
గత ఆర్ధిక సంవత్సరములో 386 కోట్ల 56 లక్షల ఋణముకు గాను 400 కోట్ల 10 లక్షల స్వయం సహాయక సంఘాలకు కల్పించడం ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం జరిగింది.

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా):
జిల్లాలోని (6) మున్సిపాలిటీల యoదు కుటుంబాలకు బ్యాంకు లింకేజి ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరoలో ఇప్పటి వరకు 660 స్వయం సహాయక సంఘాలకు 48 కోట్ల 71 లక్షల రూపాయలు మరియు స్త్రీ నిధి పధకం ద్వారా 108 స్వయం సహాయక సంఘాలకు 15 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరి చేయడము జరిగింది.

ఆసరా పించన్ల పథకము:
జిల్లాలో ఈ పథకము ద్వారా 87 వేల 602 మంది లబ్దిదారులకు నెలకు 19 కోట్ల 98 లక్షల రూపాయల పెన్షన్ ను పంపిణి చేయడము జరుగుచున్నది.

రూర్భన్:
రూర్భన్ మిషన్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పట్టణ సదుపాయాలను కల్పిoచాలనే ధ్యేయంతో చౌటుప్పల్ మండలము నందు 15 కోట్ల రూపాయలతో 256 పనులు చేపట్టగా, 198 పనులు పూర్తి కాగా 58 పనులు పురోగతి లో ఉన్నవి.

షెడ్యూల్డు కులముల అభివృద్ధి:
జిల్లాలోని 19 వసతి గృహములలో 1 వేయి 503 మంది విద్యార్థులకు, అలాగే కళాశాలల వసతి గృహాలలో 195 మందికి ప్రవేశం కల్పించడం జరిగినది.
పోస్టు మెట్రిక్ మరియు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనముల ద్వారా 2021-22 సంవత్సరoలో 2 వేల 960 మంది విద్యార్థినీ, విద్యార్థులకు 4 కోట్ల 18 లక్షల రూపాయలు మంజూరి చేయనైనది.
బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా 2021-22 సంవత్సరoలో ఉపకార వేతనం క్రింద 146 మంది విద్యార్థులకు 22 లక్షల 72 వేల రూపాయలు ప్రభుత్వేతర పాఠశాలల యందు విద్యనభ్యసిoచుటకు వసతి కల్పించనైనది.
కులాoతర వివాహం చేసుకున్న 17 జంటలకు ప్రోత్సాహకముగా 42 లక్షల 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయనైనది.

జిల్లా షెడ్యూల్డు కులముల సేవ సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్:
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దత్తత తీసుకున్న తుర్కపల్లి మండలములోని వాసాలమర్రి గ్రామములో దళిత బంధు పథకం క్రింద 76 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున 7 కోట్ల 60 లక్షల రూపాయల నిధులు విడుదల చేయడమైనది.

దళిత బంధు పథకం క్రింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేయుటకు నిర్ణయిoచడమైనది.ఆ ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గముల నుండి 337 కుటుంబములను గుర్తించడము జరిగినది. అందులో 337 కుటుంబములకు 33 కోట్ల 70 లక్షల రూపాయలతో యూనిట్లు మంజూరి చేయడమైనది.వారికీ అవగాహన సదస్సులు నిర్వహించబడినది. 209 యూనిట్లు అమలు పరుచబడినది.
2021-22 ఆర్ధిక సంవత్సరములో 251 యూనిట్లకు 3 కోట్ల 56 లక్షల రూపాయలతో
251 షెడ్యూల్డు కులాల కుటుంబాలను అభివృద్ధి కోసం నిధులు మంజూరి చేయడం జరిగింది
రామన్నపేట, అడ్డగూడూర్ మరియు మోత్కూర్ మండలములలో 139 మిని డైరీ యూనిట్లకు 2 కోట్ల 78 లక్షల రూపాయలు ఎస్.సి ప్రత్యేక సాదికారిత కార్యక్రమం ద్వారా ఆర్హులైన వారిని ఎంపిక చేయడం జరిగింది.

గిరిజన సంక్షేమము :
జిల్లాలో 8 గిరిజన వసతి గృహాలలో 680 మంది విద్యార్ధులు వసతి పొందుతున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ క్రింద 2021-22 సంవత్సరoలో ఇప్పటివరకు విద్యార్ధినీ విద్యార్ధులకు 430 లక్షల 27 వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయడము జరిగినది.
అంబేద్కర్ ఓవర్ సిస్ పథకం క్రింద ఇద్దరు విద్యార్దులకు 40 లక్షల రూపాయలు మంజూరీ చేయనైనది.
TRICOR పధకము క్రింద 2021-22 సంవత్సరమునకు 294 మందికి సబ్సిడీ మరియు బ్యాంక్ లోన్ తో సహ మొత్తము 6 కోట్ల 3 లక్షల 93 వేల రూపాయలు మంజురి చేయడము జరిగినది.

వెనుకబడిన తరగతుల అభివృద్ధి:

జిల్లాలో ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ 18 వసతి గృహములలో 1 వేయి 65 మంది విద్యార్థులకు వసతి కల్పిoచుచున్నాము. 2021-22 ఆర్ధిక సంవత్సరoలో వసతి గృహల నిర్వహణకు 30 లక్షల 53 వేల రూపాయలు మంజూరి కాబడినవి.
కళాశాల విద్యార్ధులకు ఉపకారవేతనము క్రింద 2021-22 సంత్సరమునకు విద్యార్ధులకు 8కోట్ల 53 లక్షల 95 వేల 955 రూపాయలు నిధులు ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాగా 16 వేల 666 మంది విద్యార్ధులకు గాను 8కోట్ల 4 లక్షల 39 వేల ,470 రూపాయల నిధులు ఖర్చు చేయడం జరిగినది.
మహాత్మ జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పధకం ద్వారా జిల్లాలో 4 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనైనది.

మైనారిటీల సంక్షేమo:
జిల్లాలో మూడు మైనారిటీ గురుకుల పాఠశాలలలో విద్యార్థులకు విద్యాబోధన జరుగుచున్నది మరియు జిల్లాలో 3 మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలలో విద్యార్థులతో విద్యాబోధన జరుగుచున్నది.
రంజాన్ పండుగ 2022 సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిరుపేద ముస్లింలకు 2 వేల 500 జతల దుస్తులు పంపిణి మరియు 5 లక్షల రూపాయలతో నిరుపేద ముస్లింలకు రంజాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడము జరిగినది
క్రిస్మస్ పండుగ 2021 సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం నిరుపేద క్రిస్టియన్లకు 3వేల జతల దుస్తులను పంపిణి మరియు 4 లక్షల రూపాయలతో క్రిస్మస్ విందు ఏర్పాటు చేయడము జరిగినది.

మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులు:
జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా 4 ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్ వాడీ కేంద్రాలు పనిచేయుచున్నవి.
ఆరోగ్య లక్ష్మి పధకం ద్వారా 24 వేల 306 మంది గర్భవతులకు పాలు, గుడ్లు, కూరగాయలు మరియు పప్పు లతో భోజనం, 5 వేల 604 మంది బాలింతలకు మరియు 16 వేల 401 మంది 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పోషక ఆహారం అందిస్తున్నాము.
16 వేల 401 మంది 6 నెలల నుండి 3 సంవత్సరల పిల్లలకి బాలామృతం అందిస్తున్నాము.
జిల్లాలో ఇప్పటివరకు 31 చెవి మిషన్ 7 లాప్ టాప్ లు, 24 మోటార్ వెహికల్స్, 29 ట్రై సైకిల్స్ 2013 వీల్ చైర్ పంపిణి చేయడం జరిగింది.

విద్యుత్:
జిల్లాలో 1 లక్ష 9 వేల 480 మంది రైతులకు వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాము.
ఈ ఆర్ధిక సంవత్సరంలో 4 వేల 411 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా 101 యూనిట్ల లోపు విద్యుత్ సబ్సిడీ పథకం ద్వారా 14 వేల 992 మంది SC మరియు ST వినియోగదారులకు 28 లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.
నూతనoగా పోచంపల్లి మండలము దేశముఖి గ్రామము లో 33/11 KV ఉప విద్యుత్ కేంద్రము ప్రారంబించబడినది. మరియు తుర్కపల్లి మండలము వాసాలమర్రి గ్రామములో 33/11 KV ఉప విద్యుత్ కేంద్రములు మంజూరి కాబడి నిర్మాణ దశలో ఉన్నవి.
4వ విడుత పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పవర్ వీక్ ప్రోగ్రాం ద్వారా లూజు లైన్ సరిచేయుటకు మధ్యంతర స్తంభాలు మరియు వంగిన/ పాడైపోయిన/తుప్పుపట్టిన ఇనుప స్తంభాల స్థానంలో 353 కొత్త స్తంభాలు వేయడం జరిగింది.

రోడ్లు మరియు భవనాలు:
రోడ్లు,వంతెనలు మరియు భవనములు 877.36 KM తో నిర్మాణ పనులు జరుగుచున్నవి.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ నిర్మాణం పూర్తి అయి ఫెబ్రవరి 12, 2022న ప్రారంబించబడినది మరియు 7 అధికారి నివాస భవనము పనులు జరుగుచున్నవి.
నాబార్ద్ మరియు రాష్ట్ర ప్రణాళిక పధకము క్రిoద 2 వంతెనలకు 13 కోట్ల రూపాయలు మంజూరి కాగా, పనులు పురోగతి లో ఉన్నవి.

పంచాయితీరాజ్ ఇంజనీరింగ్:
PMGSY-III నిధులతో 16 రోడ్ల నిర్మాణ పనులు మరియు 5 బ్రిడ్జి నిర్మాణ పనులకు 80 కోట్ల 95 లక్షల రూపాయల తో మంజూరి కాబడి పనులు పురోగతి లో ఉన్నవి.
SDF 2021-22 నిధులతో 2 వేల 313 పనులతో 103 కోట్ల 80 లక్షల రూపాయల తో మంజూరి కాబడి పనులు పురోగతి లో ఉన్నవి మరియు MGNREGS నిధులతో 171 సి.సి రోడ్డుల నిర్మాణ పనులు 15 కోట్ల 99 లక్షల రూపాయల తో మంజూరి కాబడి 119 పనులు పూర్తి అయి మిగిలిన పనులు పురోగతి లో ఉన్నవి.18 కోట్ల 22 లక్షల రూపాయల తో మినరల్ ఫండ్ ద్వారా మంజూరైన 332 పనులలో 186 పనులు పూర్తి అయినవి.

యాదాద్రి దేవస్థాన అభివృద్ధి:
ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవాలయ 1 వేయి 187 కోట్ల రూపాయలతో పునరుద్ధరణ చేసి మార్చ్ 28 2022 న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిచే యాదాద్రి దేవాలయం ప్రారంబించనైనది.
గుట్ట పై ఉన్న శివాలయం ఏప్రిల్ 25, 2022న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిచే దేవాలయం ప్రారంబించనైనది.
గర్భగుడి నిర్మాణం మరియు తూర్పు వైపున పంచతలరాజ గోపురము, పడమర వైపున సప్తతల గోపురము మొదలగు పనులు పూర్తి అయినవి.
కొండపైన మిషన్ భగీరథ పధకం ద్వారా రోజుకు 10 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. 250 ఎకరాలతో టెంపుల్ సిటీ రోడ్లు, చెట్లు మరియు భవనాలు నిర్మాణముతో అభివృద్ధి చేయబడుచున్నది.

విద్యా శాఖ:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా చేపట్టిన మన ఉరు- మన బడి మరియు మన బస్తి- మన బడి కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో 251 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక కాగా, వీటిలో అదనపు తరగతి గదులు, రిపేర్స్, ఫర్నిచర్, పెయింటింగ్స్, టాయిలెట్స్, త్రాగునీరు, విద్యుత్ మరియు డిజిటల్ తరగతి గదుల వంటి 12 అంశాలతో బడ్జెట్ అంచనాలు, ఒప్పంద పత్రాలు, మంజూరి ఉత్తర్వులు ఇచ్చి పనులు ప్రారంబించడం జరుగుచున్నది.
తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్-2022లో మన జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, (బాయ్స్) యాదగిరిగుట్ట విద్యార్థులు చేసిన reaching the community అనే AAP టాప్ లో నిలిచి రాష్ట్ర స్ధాయి గ్రాండ్ ఫినాలే కు సెలెక్ట్ అయిన సందర్భంగా గౌరవ రాష్ట్ర మంత్రులు శ్రీ K T రామారావు గారు, శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు అభినందిచడం జరిగింది.

ఇంటర్మీడియట్ విద్య:
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 14 గురుకుల కళాశాలలు, 5 KGBV మరియు 7 ఆదర్శ కళాశాలలు ఉన్నవి. మొత్తం కళాశాలలలో 14 వేల 528 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసించడం జరుగుతుంది.
నవంబర్ 2021లో మొదటి సంవత్సర వార్షిక పరీక్షలలో కరోన కారణాల వలన విద్యార్థుల భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందరిని ఉత్తీర్ణత చేసింది.

పరిశ్రమలు:
TS-iPASS ద్వారా ఇప్పటివరకు 647 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడమైనది. వీటిలో 347 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభిoచాయి.
చౌటుప్పల్ మండలము లోని మల్కాపూర్ లో TSIIC-TIF ఆద్వర్యంలో నూతన MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ స్థాపించబడినది. ఇందులో 1 వేయి 553 కోట్ల రూపాయల పెట్టుబడి తో 450 పరిశ్రమలు స్థాపించుటకు ప్లాట్లు కేటాయించ బడినవి. దీని ద్వారా 34 వేల మంది నిరుద్యోగులు ఉపాధి పొందే అవకాశము కలదు.
టి- ప్రైడ్ పధకం ద్వారా ఇప్పటివరకు 27 మంది షెడ్యూల్డ్ కులముల మరియు షెడ్యూల్డ్ తెగల వారికి 62 లక్షల 88 వేల రూపాయలు మంజూరి చేయనైనది.

రెవిన్యూ విభాగం(ధరణి):
రాష్ట ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ అయిన వెంటనే రైతులకు e-పాస్ పుస్తకం జారీ అగునట్లు కొత్త రెవిన్యూ చట్టం తీసుకోని వచ్చింది. ఇట్టి చట్టం అక్టోబర్ 29, 2020 నుండి జిల్లాలోని 17 మండలాలలో అమలులోకి వచ్చినది.
ధరణి లో మొత్తం 46 వేల 14 దరఖాస్తులు చేయగా అందులో 44 వేల 982 దరఖాస్తులు పరిష్కరించడం జరిగింది.

కార్మిక సంక్షేమం:
భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరములో సహజ మరణము చెందిన 27 మంది కార్మిక కుటుంబాలకు 27 లక్షల 50 వేల రూపాయలు మరియు ప్రమాదవశాత్తు మరణించిన 3 కార్మిక కుటుంబాలకు 13 లక్షల 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయము అందించడము జరిగినది.
ప్రసూతి సహాయ పధకం క్రింద 27 మంది కార్మికులకు 7 లక్షల 40 వేల రూపాయలు మరియు వివాహ కానుక పధకం క్రింద 27 మంది కార్మిక కుటుంబాలకు 6 లక్షల 50 రూపాయలు ఆర్ధిక సహాయము అందించడము జరిగిoది

జిల్లా ప్రజా పరిషత్:
2021-22 సంవత్సరమునకు కేంద్ర ప్రభుత్వం నుండి జిల్లాకు 15 వ ఆర్ధిక సంఘం నిధులు 2 కోట్ల 3 లక్షల 78 వేల రూపాయలు విడుదల అయినవి.
2021-22 సంవత్సరమునకు కేంద్ర ప్రభుత్వం నుండి 17 మండలాలకు 15 వ ఆర్ధిక సంఘం నిధులు 4 కోట్ల 6 లక్షల 95 వేల రూపాయలు విడుదల అయినవి.

యువజన సర్వీసులు మరియు క్రీడలు:
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దత్తత తీసుకున్న తుర్కపల్లి మండలములోని వాసాలమర్రి గ్రామములో 5 ట్రేడ్ లలో శిక్షణ పూర్తి చేసుకున్న 107 మందికి ధ్రువ పత్రములు అందజేయడం జరిగింది.
వేసవి శిక్షణ శిబరములు 10 గ్రామీణ ప్రాంతంలోమరియు 5 పట్టణ ప్రాంతంలో వివిధ క్రీడా అంశాలలో శిక్షణ ఇవ్వబడుచున్నది.

ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ:-
జిల్లాలో 82 మద్యం దుకాణలు మరియు 12 బార్లు కలవు. మద్యం దుకాణలు మరియు బార్లు దరఖాస్తుల ద్వారా 31 కోట్ల 60 లక్షల రూపాయల ఆదాయం లబించినది.
జిల్లాలో గీత కార్మికుల సంక్షేమ కార్యక్రమములో భాగంగా 2021 సంవత్సరoలో మరణించిన 18 కుటుంబాలకు మరియు ప్రమాదవ శాత్తు వికలాంగులైన 29 మందికి, తాత్కాలిక వికలాoగులైన 30 మందికి, 2 కోట్ల 38 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందజేయడం జరిగినది. ఈ ఆర్ధిక సంవత్సరములో తెలంగాణాకు హరిత హారంలో భాగంగా 26 వేల 900 ఈత, కర్జూర మొక్కలు నాటడం జరిగింది.

వ్యవసాయ మార్కెటింగ్:-
జిల్లాలో ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు మరియు వలిగొండ మండల కేంద్రాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీలలో 14 గోదాములు కలవు. వాటి సామర్ధ్యము విలువ 50 వేల మెట్రిక్ టన్నులు.

గనులు మరియు భూగర్భ శాఖ:-
జిల్లా ఖనిజ సంక్షేమ నిధి నుండి విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ మరియు గ్రామీణ రోడ్ల కై 333 ప్రాజెక్టుల ద్వారా 19 కోట్ల 16 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఈ పనులలో 236 పూర్తి అయినవి మిగతా పనులు పురోగతిలో ఉన్నవి.
జిల్లాలో 2021-22 ఆర్ధిక సంవత్సరము ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 75 కోట్ల 40 లక్షల రూపాయల ఆదాయం సాదించడం జరిగింది.

విపత్తుల స్పంధన మరియు అగ్నిమాపక శాఖ:
జిల్లాలో అగ్ని ప్రమాదములను నియంత్రించే సామర్ధ్యం గల అధునాతన అగ్నిమాపక వాహనం మూడు “మల్టీ పర్పస్ టెండర్” మరియు ఇరుకైన ప్రదేశాలలో జరిగే అగ్ని ప్రమాదములను సత్వరమే నివారించుటకు మూడు “Mist Bullet” లను అందుబాటులో ఉంచడం జరిగింది.
జిల్లాలోని 6 అగ్నిమాపక కేంద్రంల పరిధిలో జరిగిన మొత్తం 201 అగ్ని ప్రమాదాలలో 9 కోట్ల 3 లక్షల రూపాయలు ఆస్తిని కాపాడటం జరిగింది. అలాగే గత సంవత్సరoలో జిల్లాలో జరిగిన వివిధ అగ్ని ప్రమాదములలో 4 మందిని ప్రాణాలతో కాపాడటం జరిగింది.

పోలీస్ శాఖ :
మన రాచకొండ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ మన రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
నేరాల నియంత్రణకై జిల్లాలో అన్ని గ్రామాలలో, పట్టాణాలలో ముఖ్యమైన కూడళ్ళలో 11 వేల 678 సి.సి కెమెరాలను, ఏర్పాటు చేయడం జరిగిoది.
జిల్లాలో ప్రజలలో సాంఘిక దురాచారాలపై అన్నీ ముఖ్యమైన ప్రాంతాలలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ ప్రజలలో సరియైన అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలోని మహిళల భద్రత కోసం ACP స్థాయి అధికారి పర్యవేక్షణలో she టీమ్స్ ను ఏర్పట్టు చేసి ప్రతి రోజు కళాశాలలు, పాఠశాలలు మరియు రద్దీగా ఉండే బస్సు స్టాండ్ ప్రాంతాలలో నిరతర నిఘాను కొనసాగించడం జరుగుచున్నది.

ప్రజావాణి:
ప్రజా సమస్యల సత్వర పరిష్కారము కొరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నది. ప్రజావాణి లో వచ్చిన 464 దరఖాస్తులలో 310 దరఖాస్తులు పరిష్కరించనైనది.
రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మన యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్ళి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికి అందేటట్లు చేయడానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, స్వచంద సంస్థలు, బ్యాంకర్లకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
అదే విధముగా శాంతి భద్రతలు కాపాడటంలో తమవంతు కృషి చేస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తూ అందరం కలసి బంగారు తెలంగాణ సాధనలో పునరంకితులవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను.

 

Share This Post