ప్రెస్ నోట్:02. 06. 2022 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కవులు అందరితో కలవడం చాలా సంతోషంగా ఉందని వారి కవితల ద్వారా సమాజం లోని సమస్యలను వివరిస్తూ సమాజo బాగు కోసం వారి కవితలను ఒక ఆయుధంగా వాడుతారని , వారు చదివే కవితలకు అర్ధం ఉంటుందని తెలుపుతూ ఈ కవి సమ్మేళనానికి హాజరైన కవులు అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కవి సమ్మేళనంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డా,, పోరెడ్డి రంగయ్య, ప్రధాన కార్యదర్శి బండారు జయశ్రీ, అభినయ శ్రీనివాస్, డా,, లింగంపల్లి రామచంద్రం, పాలకుర్తి రామూర్తి , శ్రీపాద శివ ప్రసాద్ , జి. వీరా రెడ్డి, బండిరాజుల శంఖర్, పి .లింగారెడ్డి, మర్రి జయశ్రీ, పి. మత్స్యగిరి, గజరాజు మధు, బి.యాదగిరి , డి. మల్లికార్జున్, బి.కిరణ్, మహేందర్, టి. వెంకటేశ్వర్ రావు, బి.సోమయ్య, కె.రమేష్, బి. వీరా రెడ్డి, కె.దశరథం , సతీష్, బి. శివ శంఖర్ తదితరులు, తమ కవితలను వినిపించారు.

ఈ సందర్బంగా బోగ హరినాథ్, రెబ్బ మల్లికార్జున్, పెసరు లింగారెడ్డి వ్రాసిన కవిత పుస్తకాలను జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి , RDO భూపాల్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ నాగేశ్వర చారి, డా. పి .రంగయ్య , బండారు జయశ్రీ, ఆవిష్కరించారు.

కవి సమ్మేళనానికి హాజరైన 50 మంది కవులను జిల్లా యంత్రాoగము తరుపున పూల మాల , షాలువ, ప్రశంసా పత్రంతో సన్మానించడం జరిగింది.

Share This Post