తనిఖీలో భాగంగా చౌటుప్పల్ తదితర ప్రాంతాల నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న పాల వాహనములను , వ్యాపారస్తుల ఇళ్లను తనిఖీ చేసి సుమారు 10 అనుమానిత శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ నాచారం లో గల స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ కు పంపించడం జరిగింది . వాటి ఫలితాల ఆధారంగా పాల కల్తీకి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతాయని, గత నెల రోజుల నుండి యాదాద్రి జిల్లాలో వరుస కేసులు నమోదు కావడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని , ఇక నుంచి కల్తీ పై ప్రత్యేక నిఘా పెట్టి తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, కల్తీ పాలు తాగటం వల్లన ప్రజలకు ఆరోగ్య పరమైన సమస్యలు వస్తాయని , ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండి పాలను కొనుగోలు చేసి ఉపయోగించుకోవాలని, కల్తీకి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు.