ప్రెస్ నోట్:03. 06. 2022 రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెలో మార్పు కనిపిస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు.

శుక్రవారం నుండి ప్రారంభం అయిన పల్లె ప్రగతి కార్య్రక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ బి.బి నగర్ మండలo మీది తండాలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి గ్రామస్థుల చేతిలోనే ఉందని , గ్రామస్థులు అందరు కలిసి శ్రమదానం చేసినప్పుడే గ్రామంలో అభివృద్ధి కనిపిస్తుందని అధికారులు ఎంతచేసిన గ్రామస్థుల భాగస్వామ్యం లేనిదే దాని ఫలితాలు రావని కలెక్టర్ అన్నారు. గ్రామంలో 600 ఇండ్లు ఉన్నాయని ప్రతి ఇంటికి తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వడానికి మహిళలలో అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.

మీది తండాలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని శాసన సభ్యులు ఫైళ్ళ శేఖర్ రెడ్డి ప్రారంభించి , వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి గురించి చిన్న చిన్న తండాలో అవగాహన వచ్చి పరిసారాల పశుభ్రత, నేడు పల్లెలో పచ్చదనం పరిశుభ్రతలో గ్రామాలు ఉన్నాయని, గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు , నర్సరీలు, క్రీడా మైదానాలు నిర్మించేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామంలో ఇప్పటివరకు రోడ్లు, డ్రైనేజి, కరెంట్ స్థంభాలు ఇచ్చామని ఆట వస్తువులు అందజేసేందుకు కృషి చేస్తాన్నని , స్థలం ఉంటే క్రికెట్ మైదానం కూడా అవకాశం కల్పిస్తామని , యువత ఆట స్థలాలను ఉపయోగించుకోవాలని అన్ని ఆటలు ఆడాలని పాఠశాల పిల్లలు సెలవు రోజుల్లో ఆట స్థలాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.

తెలంగాణ క్రీడా మైదానం ప్రారంభోత్సవ సందర్బంగా జిల్లా కలెక్టర్ గ్రామస్థులతో కలిసి కొ కొ ఆటలో పాల్గొన్నారు.

అనంతరం గుండాల మండలం వెల్మజాల గ్రామంలో పల్లె ప్రగతిలో గ్రామస్థుల చే ప్రతిజ్ఞ చేయించి జిల్లా కలెక్టర్ గ్రామ సభ నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభకు కలెక్టర్ హాజరై స్త్రీలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని గ్రామ అభివృద్ధికి పురుషులతో సమానంగా పని చేసి తమ గ్రామం అభివృద్ధికి కృషి చేయాలని , ముందుగా స్త్రీలు తమ ఇండ్లను శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకుంటే అదే విధంగా గ్రామం కూడా శుభ్రంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, పీడీ DRDA ఉపేందర్ రెడ్డి, సీఈఓ జడ్పీ కృష్ణ రెడ్డి, డీపీఓ సునంద , జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి , ఎంపీడీఓ, తహశీల్ధార్, MSO , గ్రామ సర్పంచ్ , తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెలో మార్పు కనిపిస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు.

Share This Post