ప్రెస్ నోట్:26. 05. 2022 మౌంట్ ఎవరెస్టు అధిరోయించిన ఇద్దరు తెలంగాణ మహిళలలో ఒకరు భువనగిరి జిల్లాకు చెందిన వారు కావటం ఎంతో గర్వాంగా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అన్నారు.

ఈ రోజు భువనగిరి మండలం లోని ఎర్రంబెల్లి కు చెందిన పడమటి అన్విత రెడ్డి ని జిల్లా కలెక్టర్ తన చాంబర్ లో సత్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పిల్లల భవిష్యతు బాగు చేయడంలో ముందు తల్లి దండ్రుల పాత్ర తరువాత ఉపాధ్యాయుల పాత్ర ఉంటుందని, అన్విత రెడ్డి తల్లి అంగన్ వాడి టీచర్, తండ్రి వ్యవసాయం చేస్తూ తమకు ఉన్న ఇద్దరి ఆడపిలలో ఒకరిని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోయించేందుకు ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించిన వారి తల్లి దండ్రులకు కలెక్టర్ ఈ సందర్బంగా అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి పాల్గొన్నారు.

Share This Post