ప్రెస్ నోట్:26. 05. 2022 యాదగిరిగుట్ట పి.హెచ్ .సి పరిధిలోని మల్లాపూర్ గ్రామం ఆరోగ్య ఉప కేంద్రాన్ని. గౌరాయిపల్లి గ్రామం ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మల్లాపూర్ ఉప కేంద్రంలో సిబ్బంది అందుబాటులో లేన్నట్లు గుర్తించడం జరిగిందని , గౌరాయిపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో ఓ. పి చాలా బాగుందని అన్నారు. గౌరాయిపల్లి ఆరోగ్య కేంద్రం అద్దె భవనంలో ఉన్నదని దానిని గ్రంధాలయ భవనంలోకి మార్చేందుకు గాను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ సర్పంచ్ ను కోరారు. వారితో పాటు గౌరాయిపల్లి డాక్టర్, ANM వెంట ఉన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మల్లాపూర్ గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు , వాటి రవాణా కు సంబంధించి , హమాలీల కొరత లేకుండా, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబందించిన రికార్డులను కూడా ఈ సందర్బంగా పరిశీలించారు.

Share This Post