ప్రెస్ నోట్:27. 05. 2022 వలిగొండ మండలo అరూరు గ్రామంలో శుక్రవారం సభకు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు పోషక ఆహార లోపం లేకుండా ఉండి మంచి ఆరోగ్య వంతమైన సమాజం నిర్మించుటకు తల్లులు అందరు మంచి పోషక ఆహార అలవాటులను నేర్చుకోవాలని, పిల్లలకు సరైన సమయంలో సరైన మోతాదులో అన్ని రకాల పోషకాల ఉన్న ఆహారాన్ని, పండ్లు, కూర గాయాలు, గుడ్లు అందించాలని అన్నారు. నార్మల్ డెలివరీ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కలెక్టర్ సవ్వివరంగా సభకు హాజరైన తల్లులకు వివరించారు. వ్యాయామం చేయటం వలన నార్మల్ డెలివరీ కి ఎక్కువ అవకాశాలు ఉంటాయని, అంగన్వాడీ సిబ్బంది చే వ్యాయామం చేయించి గర్భిణిలతో కలెక్టర్ ఈ సందర్బంగా ప్రాక్టీస్ చేయించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు , అన్న ప్రసన్న , అక్షర భ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణీ బాలింతలకు పిల్లలకు అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు సీడీపీఓ , మెడికల్ ఆఫీసర్ , ANM , ఆశాలు, చేస్తున్న సేవలను కలెక్టర్ ఈ సందర్బంగా ప్రశంసించారు.

. అనంతరం పిహెచ్ సి లో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో జిల్ల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, సి.డి .పి. ఓ శైలజ, గ్రామ సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ పసల జ్యోతి, మెడికల్ ఆఫీసర్ జ్యోతి, అంగన్ వాడి సూపర్వైజర్ శోభారాణి, నాగమణి, అంగన్ వాడి టీచర్లు, ఆశాలు మరియు తల్లులు పాల్గొన్నారు.

వలిగొండ మండలo అరూరు గ్రామంలో శుక్రవారం సభకు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Share This Post