ప్రెస్ నోట్:28. 05. 2022 భువనగిరి పట్టణంలో లోని మున్సిపాలిటీలో MENSTERUAL HYGINE DAY సందర్బంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీలకు నెలసరి అనేది సాదరనం అని దానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదని , ఆ సమయంలో తమకు అవసరము ఉన్న వస్తువులను తమ తల్లి దండ్రులతో తెప్పించుకొని శుభ్రత పాటించాలని కలెక్టర్ అన్నారు. గతంలో ఈ విషయం పై స్త్రీలు మాత్రమే చర్చించుకునేవారు కాని ఇప్పుడు అందరూ కలిసి చర్చించడం అభినందనీయం అని కలెక్టర్ అన్నారు. చిన్న పిల్లలు భయపడకుండా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలిని క్లాత్ వాడకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాప్కిన్ ప్యాడ్స్ వాడటం వళ్ళ పరిశుభ్రoగా ఉండవచ్చునని , తను వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పని చేసిన సమయంలో మహిళా కార్మికులకు సదస్సు ఏర్పాటు చేసి క్లాత్ కు బదులుగా మహిళ సిబ్బంది అందరికి మున్సపాలిటి తరుపున ఉచితంగా నాప్కిన్స్ అందజేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని కస్తూర్భా గాంధీ పాఠశాలలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు అందుబాటులో నాప్కిన్స్ మిషన్ ఏర్పాటు చేయాలనీ , జిల్లాలోని మహిళా పారిశుధ్య కార్మికులందరికీ ఉచితంగా నాప్కిన్స్ అందజేయాలని మున్సిపల్
కమిషనర్ ను కోరారు. దీనిపై బాలికలలో , గ్రామీణా మహిళలో అవగాహన రావాలని కలెక్టర్ అన్నారు.

ప్రతి ఆరోగ్య కేంద్రం డాక్టర్లు , సిబ్బంది సాధారణ ప్రసవాల పై మహిళలకు అవగాహన కల్పించాలని , గర్భిణీ స్త్రీలు పౌష్ఠిక ఆహరం తీసుకునే విధానాలను , వ్యాయామం చేసే విధానాన్ని తమ ఆరోగ్య కేంద్రాలలో చిన్న చిన్న సదస్సుల ద్వారా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు .

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్, స్త్రీ శిశు సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post