ప్రెస్ నోట్:30. 05. 2022 దేశంలో కోవిడ్ మహమ్మారి ద్వారా అనాదులైన పిల్లలు , విద్యార్థులను PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా దత్తత తీసుకుంటున్నట్లు గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోది అన్నారు.

దేశ వ్యాప్తంగా ఈ రోజు వర్చ్యువల్ గా ఈ పథకాన్ని ప్రారంభించి వారు మాట్లాడుతూ ఈ కారక్రమాని దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు దీని ద్వారా కోవిడ్ కారణంగా తల్లి దండ్రులు కోల్పోయిన పిల్లలకు ఆసరా ఏర్పడుతుందని అన్నారు. ఈ పిల్లలకు 23 ఏండ్లు నిండే సరికి 10 లక్షలు వారికి అందుతాయని వీరిలో ప్రతి ఒక్కరికి ఆయుష్ మాన్ భారత్ పథకం క్రింద 5 లక్షల ఆరోగ్య భీమా కల్పించడం జరుగుతుందని 18 సవంత్సరాల నుండి 23 సవంత్సరాల వరకు నెల వారి ఉపకార వేతనం 4 వేలు అందజేస్తామని , ఉన్నత విద్య కోసం ఋణ సదుపాయం కల్పించి ఆ ఋణానికి అయ్యే వడ్డీ PM కేర్స్ నుండి చెల్లించడం జరుగుతుందని, ఈ పిల్లలకు ఉచిత భోజన , వసతి సౌకర్యాలు , అంగన్వాడీ కేంద్రాల సహకారంతో పిల్లలకు పౌష్ఠిక ఆహరం అందించడం జరుగుతుందని , ఈ పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో 12 మంది పిల్లలను గుర్తించడం జరిగిందని వీరికి PM కేర్ ఫర్ చిల్డ్రన్ స్కిం వర్తింప చేస్తూ ఒక్కొక్కరికి 5 లక్షల ఆరోగ్య భీమా కార్డు , 10 లక్షలు డిపాజిట్ చేసిన పాస్ బుక్ , PM కేర్ స్నేహ పత్ర సర్టిఫికెట్ , ఈ పిల్లలకు ప్రధానమంత్రి ద్వారా జారీ చేయబడిన లేఖ ను ఫైల్ రూపంలో భద్రపరచి సంబంధిత పిల్లలకు జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ పిల్లల సంరక్షణకు నోడల్ అధికారులుగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ , ఆయా వర్గాలకు చెందిన సంక్షేమ అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు. పిల్లలు అధైర్య పడవద్దని మంచి చదువుతో పాటు మంచి నడవడి కలిగి ఉండాలని తమ సంరక్షకులుగా ఉన్న కుటుంబ సభ్యుల మాట జాబాదాటవద్దని సంరక్షులని ఇబ్బంది పెట్టవద్దని తల్లిదండ్రులు కోల్పయిన నీకు వారే తల్లిదండ్రులై మంచి చెడు చూస్తున్నపుడు మీరు కూడా వారితో మంచిగా ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈ పిల్లలు మనోధైర్యం కోల్పోకుండా కష్టపడి చదివి పైకి రావాలని మంచి మనిషిగా తయారు కావాలని , జీవితం ఫుల్ స్టాప్ కాకుండా లైఫ్ ఫుల్ చేస్తూ బతకాలని , ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా తనతో సంప్రదించవచ్చునని కలెక్టర్ తన ఫోన్ నెంబర్ ను పిల్లలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, బాలల సంక్షేమ సమితి చైర్మన్ బండారు జయశ్రీ, సభ్యులు శివరాజు , జిల్లా బాలల పరిరక్షణ అధికారు పి . సైదులు , జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తా నాయక్, జిల్లా సహాయ వెనుకబడిన సంక్షేమ అధికారి గంగాధర్ , జిల్లా విద్య శాఖ కమ్యూనిటీ మొబిలైజర్ జోసెఫ్ , బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, కోవిడ్ బాధిత పిల్లల సంరక్షకులు , తదితరులు పాల్గొన్నారు.

Share This Post