ప్రెస్ నోట్:30. 05. 2022 ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినోత్సవం సందర్బంగా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి అధ్యక్ష వహించి మాట్లాడుతూ యాదాద్రి జిల్లాను స్మోకింగ్ ఫ్రీ జిల్లాగా చేయాలని అందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలనీ కోరారు. బహిరంగ ప్రదేశాలలో దూమపానం నేరం అని తాగినచో 200 జరిమాన లేదా జైలు శిక్ష ఉంటుందని ,విద్య సంస్థలకు 100 గజాల వరకు ఎలాంటి పొగాకు విక్రయాలు జరగరాదని , 18 సవంత్సరాల లోపు పిల్లలు అమ్మిన కొనుగోలు చేసిన నేరం అని పొగాకు తాగటం వలన క్యాన్సర్, గుండెజబ్బు, ఊపిరి తిత్తుల వ్యాధులు, టి.వి డయాబెటిస్ రక్తపోటు మొదలుగునవి వస్తాయని అన్నారు. ప్రజలు వీటికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపుడుకోవాలని ఆమే అన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా,, కె. మల్లికార్జున్ ఆధ్వర్యంలో భువనగిరి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో పొగ తాగుతున్న వారిని గుర్తించి 200 రూపాయాలు జరిమాన విధించడం జరిగింది. పొగ తాగడం వలన కలిగే దుష్పరిమాణాలను వారికి తెలిపి పొగ తాగటం మాని వేయాలని తెలిపారు. ఇప్పటినుండి జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రాంతాలో పొగ తాగేవారిని గుర్తించి జరిమాన విధిస్తామని ఈ దాడులు జిల్లా వ్యాప్తంగా పోలీస్ వారి సహకారంతో జరుగుతాయని వారు తెలిపారు.
మే 31 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భoగా భువనగిరి పట్టణంలోని జూనియర్ కళాశాల నుండి ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ ర్యాలీని ప్రారంభిస్తారు.

ఈ సమావేశంలో ACP వెంకట్ రెడ్డి , జిల్లా వ్యవసాయ అధికారిణి అనురాధ, డి.పి. ఓ సునంద , కమిటీ సభ్యులు, స్కిడ్ సొసైటీ ఫర్ కమ్యూనిటీ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలెప్మెంట్ డైరెక్టర్ నాగరాజు , ప్రాజెక్ట్ మేనేజర్ భాను కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post