ప్రెస్ నోట్:30. 05. 2022 యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒడిస్స వలస కార్మికుల పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఒడిస్స భాషలో ఉన్న 10 కథ వాచకాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వాచకాలు ఒడిస్స వలస కార్మికుల పిల్లలకు చాలా ఉపయోగ కరంగా , సులభకరంగా ఉన్నాయని వీటిని పిల్లలకు అందించి బడి వాతావరణాని కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిణి , బాల పరిరక్షణ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, బాలల సంక్షేమ సమితి చైర్మన్ బండారు జయశ్రీ, సభ్యులు శివరాజు , జిల్లా బాలల పరిరక్షణ అ ధికారి పి . సైదులు , తదితర సిబ్బంది పాల్గొన్నారు .

Share This Post