ప్రెస్ రిలీజ్. తేది.15.9.2021. హనుమకొండ. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయండి : రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

ప్రెస్ రిలీజ్.
తేది.15.9.2021.
హనుమకొండ.

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయండి : రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతూ,మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య లతో కలసి పశ్చిమ నియోజక వర్గ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించిన చీఫ్ విప్.

అభివృద్ధి పనులలో వేగం పెంచి నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.

బుధవారం హనుమకొండ కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతూ,మేయర్ గుండు సుధారాణి, జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య, కుడా విసి మర్రి యాదవరెడ్డిలతో కలసి
పశ్చిమ వరంగల్ నియోజకవర్గంలో స్మార్ట్ సిటీ, సి ఎం ఏ, జనరల్ ఫండ్, కుడా తదితర పథకాల క్రింద కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని అధికారులతో
కూలంకషంగా సమీక్షించారు. పట్టణ ప్రగతిలో అభివృద్ధి కి సంబంధించిన వచ్చిన వినతులపై దృష్టి సారించాలని అన్నారు.

ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ఆయా పథకాల క్రింద కొనసాగుతున్న అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని లేని పక్షంలో ఆయా ఏజెన్సీలపై జరిమానాలు విధించాలని, పని చేయని గుత్తేదారులను తొలగించాలని, ఆయా పనులకు షార్ట్ టెండర్ పిలచి పనులు త్వరితగతిన చేయాలని ఆదేశించారు.

హనుమకొండ బస్ స్టేషన్ నవికరణకు ఆర్టీసీ ఆర్ ఎం, స్మార్ట్ సిటీ అధికారులు సంయుక్తంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

భద్రకాళి దేవాలయం వద్ద మాడ వీధులలో చేపట్టే అభివృద్ధి పనులు భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు.
బంధం చెరువు సుందరికరణ, ఇరిగేషన్, స్మార్ట్ సిటీ కింద్ర అభివృద్ధి చేయుటకు డి పి ఆర్ సమర్పించాలని ఆదేశించారు.

నగరంలో స్మార్ట్ రోడ్ ఫేస్ 1 క్రింద జరుగుతున్న ఆర్3 , ఆర్4 ల నిర్మాణ పనులు పూర్తి చేసి ఈ నెల చివరి కల్లా అందియ్యాలని, ఆర్1 ఆర్2 రోడ్ నిర్మాణాలు దసరా చివరి కల్లా పూర్తవ్వాలని ఆదేశించారు.

ఎన్ జి ఓస్ కాలనీ ప్రధాన రహదారి పనులు ఇంకను అసంపూర్తగా ఉన్నందున వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోపాలపురం ఊర చెరువు నుండి ప్రసిడెన్సీ స్కూల్ వరకు నాలపై ఇరిగేషన్ శాఖ ద్వారా వరద నివారణలకు చేపట్టే డక్ట్ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.

ఆయా అభివృద్ధి పనులలో జాప్యం జరుగకుండా సకాలంలో పూర్తయ్యేలా ఇంజనీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని చీఫ్ విప్ ఆదేశించారు.

ఈ సమీక్షలో ఇరిగేషన్ ఎస్ ఈ సుధాకర్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ ఎం విజయ్ భాస్కర్,డిఎం భానుకిరణ్, జిల్లా రెవిన్యూ అధికారి వాసుచంద్ర, కుడా పిఓ అజిత్ రెడ్డి,
స్మార్ట్ సిటీ పీఎం ఓ ఆనంద్ వోలెటి, ఈ ఈ లు శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ కుమార్, లక్ష్మారెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ రాజమ్,డి ఈ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post