ప్రైవేటు స్కూళ్లకు దీటుగా అంగన్వాడి ప్రీ స్కూల్ ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

ప్రైవేటు స్కూళ్లకు దీటుగా అంగన్వాడి ప్రీ స్కూల్ ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం నారాయణపేట పట్టణంలో మహిళ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిశువు అభివృద్ధి పథకం ద్వారా ఏర్పాటుచేసిన అంగన్వాడి ప్రీ స్కూల్ లో స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలర్ ఫుల్ గా ఉంటుందని 150 మంది విద్యార్థులతో ప్రీ స్కూల్ ఏడు మంది టీచర్లతో నడుస్తుందని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు రావడానికి బస్సు సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. చిన్నారులు అంగన్వాడీ ప్రీస్కూల్ సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విద్యను పొందాలని కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు.

ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా అంగన్వాడి ప్రీ స్కూల్ ఏర్పాటు చేసి ప్రవేట్ స్కూల్లకు దీటుగా బోధన చేస్తున్నట్లు తెలిపారు. ప్రీస్కూల్లో బోధించే ఉపాధ్యాయులకు హైదరాబాదులోని ఆంధ్ర సభకు టై అప్ చేసినం మంచి విద్యాబోధన గావించేందుకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ సంవత్సరం 100 మందిని చేర్చుకోవాలని డి. డబ్ల్యూ ఓ కు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతి వార్డు నుండి విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు ప్రీస్కూల్ కు రావడానికి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు అంగన్వాడీ ప్రీ స్కూల్స్ ఎంతో పని చేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు……..

ఈ కార్యక్రమం లో జిల్లా వెల్ఫేర్ అధికారి వేణుగోపాల్,cwc చైర్మన్ అశోక్, మున్సిపల్ చైర్మన్ గండే అనసుయ్య, మర్కేత్కామిటి చైర్మన్ జ్యోతి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post