పత్రిక ప్రకటన
నారాయణపేట జిల్లా
తేది: 06-08-2021
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలి – అదనపు జిల్లా కలెక్టర్ చంద్ర రెడ్డి
ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప వ్యక్తి అని ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని అదనపు జిల్లా కలెక్టర్ చంద్ర రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి అదనపు జిల్లా కలెక్టర్ చంద్ర రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి, ఏఓ మరియు కార్యాలయ సిబ్బందితో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసిజ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ….
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం సాగిందని అన్నారు. ఆయన ఆశయాలకనుగుణంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి కారకుడని అన్నారు. జయశంకర్ క్రమశిక్షణకు మారుపేరని, విద్యార్థి దశ నుండి యూనివర్సిటీ వీసీ వరకు ఎకనమిస్టు నుంచి తెలంగాణ సిద్ధాంతకర్త వరకు ఆయన జీవితంలోని సిద్ధాంతాలను నేటి యువత అనుకరించడంమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది అదనపు కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణమ చారి, ఏఓ ఖలీద్, జిల్లా అధికారులు శ్రీ రాం , బాబు, గంగ రెడ్డి, మురళి మరియు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
————————————————————
జిల్లా పౌర సంబందాల అధికారి ద్వార జరి.