పత్రికా ప్రకటన తేది: 06-08-20 21
ప్రొఫెసర్ జయశంకర్ సార్ కళలు గన్న తెలంగాణా రాష్ట్ర సాదనే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.
శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 88వ జయంతి ని పురష్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ , శ్రీహర్ష , జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బందితో కలిసి కలెక్టర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి కారకులయ్యారని అన్నారు. స్వ రాష్ట్ర స్వాప్నికుడు గా, ఉద్యమ బావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం సాగిందని, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయ శంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగానడుచుకోవాలని, తెలంగాణా వాదాన్ని, అంకిత బావాన్ని, సముచితమైన స్తానాన్నిగుర్తించి జయంతి జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు రఘురామ్లు శర్మ , శ్రీహర్ష జిల్లా అధికారులు రేవతి, చెన్నమ్మ , రాజు , వేణుగోపాల్ రెడ్డి, జయలక్ష్మి , కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————-జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

