ప్రొఫెసర్ కొత్తపల్లి జయ శంకర్ సార్ ఆశయసాధనకు కృషి చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 06, 2021ఆదిలాబాదు:-

ప్రొఫెసర్ కొత్తపల్లి జయ శంకర్ సార్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రొఫెసర్ జయ శంకర్ జయంతి సందర్బంగా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జయశంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్నారని, ముల్కి ఆందోళన లో కూడా పాల్గొన్నారని తెలిపారు. ఆయన చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తించి ఆగష్టు 6 న జయశంకర్ సార్ జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన పేద వర్గాల వారికీ అందేలా చూడాలని అన్నారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, రాజస్వ మండల అధికారి జాడి రాజేశ్వర్, అధికారులు జయశంకర్ చిత్రపటానికి పూలను సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, వర్ణ, రెవెన్యూ, ట్రెజరీ, ప్రణాళిక శాఖ, సహకార శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post