ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.

పత్రికా ప్రకటన                                                                        తేది    6- 8 -2022

 

ప్రొఫెసర్ జయశంకర్  గారి ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.

శనివారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశము నందు  ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయ శంకర్ 88  వ జయంతి వేడుకలు పురష్కరించుకొని  వారి యొక్క సేవలను కొనియాడారు.   తెలంగాణా   ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని , తెలంగాణా ఉద్యమ సిదంతా కర్త అని ఉద్యమ స్పర్తిని, సేవలను కొనియాడారు. జయశంకర్ కలలుగన్న తెలంగాణ మనకు సిద్ధించిందని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు తూచ తప్పకుండా పాటించాలని అన్నారు.

ఈ సమావేశం లో  జడ్పీ సీఈవో విజయ నాయక్ ఇంచార్జ్  బీసీ వెల్ఫేర్ అధికారి శ్వేత ప్రియదర్శిని, కలెక్టరేట్ ఆఫీస్ సూపర్డెంట్లు, వరలక్ష్మి,  రాజు, మదన్ మోహన్ , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి  చే జారీ చేయబడినది.

 

 

 

 

 

 

Share This Post