ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏరువాక కేంద్రం, జిల్లా వ్యవసాయ శాఖ వారు బుధవారం నాడు రామన్నపేట మండల కేంద్రంలో వ్యవసాయ ప్రదర్శన, రైతు సదస్సు ఎం‌పి‌పి కన్నెబోయిన జ్యోతి బలరాం ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ వ్యవసాయ ప్రదర్శనకు ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి విచ్చేసినారు. ప్రదర్శనలో బాగంగా విద్యార్ధులు, రైతులకు వివిధ వ్యవసాయ పద్దతులైన సేంద్రీయ వ్యవసాయం , వరి, పత్తిలో సమగ్ర సంరక్షణ, సుక్ష్మా నీటి సేద్యం , వరిలో ఎలుకల నివారణ, వరి ప్రత్యమ్నాయ పంటలు , వాటిలో  తీసుకోవాల్సిన జాగ్రతలు, వివిధ పంటలలో కొత్త వంగడాలు, వాటి గుణ గణాలు,  డ్రోన్ ల ద్వారా పురుగుల మందుల పిచికారి వంటి అంశాల పై రైతులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు ప్రతి నమూనాను విన్న తరువాత రైతు సదస్సును ఉద్దేశించి,  జిల్లాలో రైతులకు అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగ పడుతాయని అభిప్రాయపడ్డారు. రైతులు అందరూ వరి పంట కాకుండా మిగతా లాబాదాయక పంటలు, సాగు మెళకువలు నేర్చుకొని మరింత అభివృద్ది పథములో నడవాలని కోరారు.
కార్యక్రమానికి జిల్లా ఎరువాక శాస్త్రవేతలు జి.నరేందర్, మధు శేఖర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జి.అన్నపూర్ణ , రామన్నపేట మండల  వ్యవసాయ అధికారి బి.యాదగిరి రావు , హెచ్‌.ఓ సౌమ్య , మండల తహసిల్దారు ఆంజనేయులు , మండల ఎం‌పి‌డి‌ఓ జలందర్ రెడ్డి , వ్యవసాయ విస్తరణ అధికారులు యం.స్వప్న, జి.వెంకటేష్, యం.శ్రీనివాస్, సి‌హెచ్ నరేశ్ బాబు , యం.కిరణ్ , ఏ.కృష్ణా మరియు జెడ్‌పి‌టి‌సి పున్న లక్ష్మీ జగన్ మోహన్ , Wise ఎం‌పి‌పి ఉపేందర్, ఎం‌పి‌టి‌సి హర్షిణి చంద్ర శేఖర్ , PACS ఛైర్మన్ నంద్యాల బిక్షo రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి మండల అధ్యక్షులు బత్తుల కృష్ణం గార్లు మరియు విధ్యార్ధులు , అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

Share This Post