ప్లాంటేషన్, రోడ్ల విస్తరణ, కొంకన్ పల్లి భూ నిర్వాసితుల సమస్యలపై సమావేశం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన     తేది:23.07.2022, వనపర్తి.

హరిత హారంలో భాగంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.
శనివారం ఐ డి ఓ సి జిల్లా కలెక్టర్ చాంబర్లో హరితహారం ప్లాంటేషన్, కొంకన్ పల్లి భూ నిర్వాసితుల సమస్యలపై, రోడ్ల విస్తరణ అంశాలపై జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వార్డులలో, ప్రభుత్వ పాఠశాలల్లో, పార్కులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ కు మంత్రి ఆదేశించారు. గ్రామాలలో, పట్టణాలలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అనంతరం కొంకణ్ పల్లి భూ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు ఆయన ఆదేశించారు. రోడ్ల విస్తరణ పనులలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించి, పనులను వేగవంతం చేయాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలో కోటి మొక్కలు నాటేందుకు లక్ష్యంగా హరితహారం కార్యక్రమం పనులు కొనసాగిస్తున్నట్లు మంత్రికి ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) డి వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post