ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంపై దృష్టిసారించాలి
అధికారులు అందరూ సమన్వయంతో కృషి చేయాలి
జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్
జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్‌ను తగ్గించి అందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న వాటిపై దృష్టి సారించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్లాస్టిక్‌ను తగ్గించే అంశంపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతోందని. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని కల్పించేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు, నష్టాలను ప్రజలకు తెలియజేసి వాటి వినియోగాన్ని తగ్గించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో గ్రామస్థాయి నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వల్ల పర్యావరణాన్ని రక్షించిన వారమవుతామన్నారు. అలాగే మున్ముందు తరాలకు మంచి భవిష్యత్తును అందించిన వారమవుతామని పేర్కొన్నారు. ఈ విషయాలపై అందరికీ అవగాహన కల్పించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అదనపు కలెక్టర్ శ్యాంసన్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ విషయాలపై ప్రచార సాధనాల్లో విస్కృతంగా ప్రచారం చేయాలని డీపీఆర్వోను అదనపు కలెక్టర్ శ్యాంసన్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ప్రవీణ్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, డీపీవో, డీఈవో, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి, డీపీఆర్వో, ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపాలిటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.