ఫారెస్ట్ భూములపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి చర్యలు …

ప్రచురణార్థం

ఫారెస్ట్ భూములపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి చర్యలు …

మహబూబాబాద్ నవంబర్-5:

ఫారెస్ట్ భూములపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ శశాంక నివేదించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో హైదరాబాద్ నుండి అటవీ భూముల సాగుపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో 160 గ్రామ పంచాయతీ పరిధులలో 373 హ్యాబిటేషన్ లలో అటవిభూములు సాగుచేస్తున్నందున దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముందస్తుగా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈనెల 8వ తేదీ నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నందున అధికారులు, సిబ్బందికి రెండు సార్లు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డి.ఎఫ్.ఓ. రవికిరణ్, అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, కొమరయ్య పాల్గొన్నారు.
———————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post