ఫారెస్ట్ రెవెన్యూ భూముల అభ్యంతరాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి… జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ప్రచురణార్థం

ఫారెస్ట్ రెవెన్యూ భూముల అభ్యంతరాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి…

మహబూబాబాద్ జూలై 19:

ఫారెస్ట్ రెవెన్యూ భూములు అభ్యంతరాలపై సంయుక్త సర్వే చేసి త్వరితగతిన నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ వి. పి గౌతం ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో అటవీశాఖ రెవెన్యూ శాఖల అధికారుల తో అభ్యంతరాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూములను సర్వే చేసేటప్పుడు అటవీశాఖ, రెవెన్యూశాఖ, సర్వే అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు.

ప్రధానంగా గూడూరు కొత్తగూడా గంగారం బయ్యారం నెల్లికుదురు కేసముద్రం గార్ల మండలాల లోనే అత్యధికంగా సమస్యలున్నాయని వాటిని పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు

సర్వే నెంబర్ల ఆధారంగా మొత్తం భూమి ఎంత అందులో ఫారెస్ట్ భూమి రెవెన్యూ భూమి వివరాలను గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించుకుని సర్వే చేపట్టాలన్నారు.

సర్వే పూర్తయిన భూముల వివరాలు నివేదిక రూపొందించాలని, ఇక ఇలాంటి సమస్యలు పునరావృతం కారాదని కలెక్టర్ హెచ్చరించారు. మండలాల వారీగా సర్వే చేపడుతూ పూర్తి అయిన వివరాలను నివేదికలు అందజేయాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అటవీశాఖాధికారి రవి కిరణ్ అదనపు కలెక్టర్ కొమరయ్య ఎఫ్ ఆర్ వో కృష్ణమాచారి అటవీశాఖ రేంజి అధికారులు తాసిల్దార్ లు పాల్గొన్నారు.
————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post