ఫికల్ స్లాడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (FSTP) ను ఆదిలాబాద్ శాసన సభ్యులు, మున్సిపల్ చైర్మన్ తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఆగష్టు 17, 2021ఆదిలాబాదు:-

అంటు వ్యాధులు ప్రబలకుండా, అనారోగ్యం బారిన పడకుండ ఉండడానికి ఫికల్ స్లాడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (FSTP) ను ప్రారంభించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని బంగారి గూడ కాలనీలో నూతనంగా నిర్మించిన ఫికల్ స్లాడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ని కలెక్టర్, ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న, మునిసిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా ప్లాంటు ఆవరణలో మొక్కలు నాటి, ప్లాంట్ లో ఏర్పాటు చేసిన అధునాతన యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ మున్సిపాలిటీ లో ప్రారంభించుకోవడం వలన ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, ప్లాంట్ లో రెండు రకాల బయో ఉత్పత్తులు తయారవుతాయని,  మున్సిపాలిటీ నర్సరీల్లో, శుద్ధి చేయ బడిన నీరు ప్లాంట్ పరిసరాల్లో, ఇతర పనులకు ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫికల్ స్లాడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లను  71 మున్సిపాలిటీలలో ప్రారంభించనున్నదని, ఆదిలాబాద్ మున్సిపాలిటీ లో 2 కోట్ల 56 లక్షల రూపాయలతో ఎనిమిదవ ప్లాంట్ గా ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు.  ఆదిలాబాద్ పట్టణాన్ని కాలుష్య రహిత పట్టణంగా మార్చేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులే కాకుండా ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సెప్టిక్ ట్యాంక్ మెటీరియల్స్, మానవ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ నిరుపయోగంగా పడవేయడం, పంట పొలాల్లో ఉపయోగించడంతో ప్రజలు అనారోగ్యానికి గురి కావాల్సి వచ్చేదన్నారు. ప్రజల ఆరోగ్య రీత్యా పట్టణ మున్సిపల్ ఆధ్వర్యంలో ఇలాంటి వ్యర్థాలను ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సేవలను తీసుకొచ్చి పట్టణని కాలుష్య రహిత సమాజంగా మార్చడం జరుగుతోందన్నారు. సెప్టిక్ ట్యాంక్ లోని లిక్విడ్, సాలీడ్ లను ఈ ప్లాంట్ ద్వారా ఎరువుల తయారీ, ఇతరాత్రా  ఉపయోగాలకు కాలుష్యాన్ని నివారించవచ్చు అని అన్నారు. అనంతరం సెప్టిక్ ట్యాంక్ నిర్వాహకులకు లైసెన్సులను అందజేశారు. అనంతరం మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లోని సేగ్రిగేషన్ షెడ్ ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కలెక్టర్ ఎం.డేవిడ్, మున్సిపల్ కమీషనర్ శైలజ, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, ఆస్కో టీం మేనేజర్ రంజిత్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post